Telugu News

ఖమ్మంలో  పోస్టర్ వార్ ..

పోస్టర్లను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు

0

ఖమ్మంలో  పోస్టర్ వార్ ..

== ఖమ్మంలో కాంగ్రెస్ నగరాధ్యక్షుడు పేరుతో పోస్టర్లు

==  పోస్టర్లను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మంలో పోస్టర్ల వార్ నడుస్తోంది.. కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లను ఖమ్మం నగరంలో అంటించగా వాటిని చికటి పడగానే గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అందుకు గాను పోస్టర్ల చింపివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దమైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ఐటీశాఖ, పురపాలక శాఖ మంత్రి కె.టీ.రామారావు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. వారి రాక కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక వైపు జరుగుతుంటే..

ఇది కూడ చదవండి: తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మాదే: భట్టి విక్రమార్క

మరో వైపు ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల గురించి ఖమ్మం నగరంలో పోస్టర్లను అంటించారు. ఖమ్మం నగరంలోని ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించగా పలు ప్రాంతాల్లో పోస్టర్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచార పత్రాలు ఖమ్మం జిల్లా మొత్తం అతికించి, భారీగా కౌటట్లు పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేవలం పోస్టర్లను అతికించుకుంటే చింపడం ఎంత వరకు సమంజసమని పీసీసీ సభ్యులు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎండి.జావిద్ ప్రశ్నించారు. పోస్టర్లను చించేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, ఈ అంశంపై కచ్చితంగా నినదిస్తామని అన్నారు.