అప్యాయతగా పలకిరిస్తూ.. అలయ్ బలయ్ చేస్తూ
== ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ
(ఖమ్మం-విజయం న్యూస్);-
ఆయన రాష్ట్ర మంత్రి.. చాలా ఉన్నతమైన వ్యక్తి.. కానీ ఆయనకు జనం కనిపిస్తే చాలా చిన్నపిల్లడైయైపోతారు.. అందర్ని ఆప్యాయతగా పలకరిస్తారు..? అందర్ని అక్కున చేర్చుకుంటారు.. అలయ్ బలయ్ ఇస్తారు.. ప్రేమగా మాట్లాడతారు.. అనురాగాన్ని, అనుబంధాన్ని గుర్తు చేస్తారు.. అందుకే ఆయన్ని అందరివాడు అంటారు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కడ నెగ్గాలో..? ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అని అంటుంటారు.. నిజంగా అందుకు ఆయన నిదర్శంగా ఉన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ లోని లారీ అసోసియేషన్ అధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎర్పాటు చేసిన ఇఫ్తార్, 5వ డివిజన్ ఖనాపురంలో జహీర్ అలీ అధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
also read;-మిట్టరాత్రి గూటిలోకి..
ముస్లీం సోదరలందర్ని అప్యాయతగా పలకరించారు. అందినకాడికి జోక్ లు వేస్తు అందర్ని నవ్వించారు. పెద్దల వద్ద గౌరవంగా మెలిగారు.. అప్యాయత పలకరించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.. పిల్లలతో ప్రేమను చూపించారు. అనంతరం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న దీక్షకులకు పండ్లు తినిపించి నేటి ఉపవాసంను విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ పవిత్ర ఖురాన్ లికించబడింది ఈ మాసంలోనే అని అన్నారు. ముస్లింల పక్షపాతి సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని అన్నారు.
also read :-రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితునికి ఆర్థిక సాయం..
రంజాన్ మాసం చాలా పవిత్రమైనది, రంజాన్ మాసం సందర్భంగా, నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనతో సామరస్యం శాంతిని వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లిం ప్రజానీకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడబిడ్డలకు 1,00,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసే ఇస్తార్ విందులు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్నారు, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జహీర్ అలీ, బషీర్ అలీ, తాజుద్దీన్, సలీం, బషీర్, ఆదిల్, ముజస్టర్ అలీ, జాహెద్, అఫ్జల్ హసన్, మేయర్ పును కొల్లు నీరజ, సుడా ఛైర్మెన్ విజయ్ కుమార్, ఆర్ జేసీ కృష్ణా, దగ్గు శ్రీను, బోయపాటి వాసు, పగడాల నాగరాజు గారు, నాగండ్ల కోటి తదితరులు ఉన్నారు.