Telugu News

నామినేషన్ ఉపసహరించుకున్న పొట్ల నాగేశ్వరరావు

అధిష్టానానిదే తుది నిర్ణయం అని చెప్పిన పోట్ల

0
నామినేషన్ ఉపసహరించుకున్న పొట్ల నాగేశ్వరరావు
== అధిష్టానానిదే తుది నిర్ణయం అని చెప్పిన పోట్ల
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన టీపీసీసీ ఉపా అద్యక్షులు పోట్ల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం విత్ డ్రా చేయడం జరిగింది. వారితో పాటు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు,8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు, బీసీ సెల్ జిల్లా అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అద్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఊపా అద్యక్షులు కొంటెముక్కుల నాగేశ్వరరావు, వసీం, బచ్చలకురి నాగరాజు అంజీని, నాగరాజు, తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని హామీనిచ్చారు.