Telugu News

లక్ష్యాన్ని చేదించేందుకు పేదరికం అడ్డుకాదు

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

0

లక్ష్యాన్ని చేదించేందుకు పేదరికం అడ్డుకాదు
== సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
== కల్లూరు తెలంగాణ గ్రామర్ స్కూల్ అభినందన కార్యక్రమంలో హాజరైన సండ్ర, కలెక్టర్ గౌతమ్
(కల్లూరు-విజయంన్యూస్);-
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు పేదరికం అడ్డుకాదని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపించారని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. నీట్ పోటీ పరీక్ష ద్వారా మొదటి ప్రయత్నంలోనే యం.బి.బి.యస్ సీట్లు సాధించిన కల్లూరు, పెనుబల్లి మండల విద్యార్థులకు శుక్రవారం కల్లూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామర్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన అభినందన, ఆర్ధిక సహాయం కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

also read :-పలు హాస్పిటల్స్ ప్రారంభించి, శుభకార్యాలయలకు హజరైన మంత్రి పువ్వాడ..

ఈ సందర్భంగా మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులనుద్దేశించి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత ఫలితంగానే నిరుపేద విద్యార్థులు డాక్టరు విద్య సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. మేదస్సును కొనే శక్తి ఎవరికి లేదని కష్టపడి చదివితే ఎటువంటి లక్ష్యాన్నయినా సులువగా చేరుకోచ్చన్నారు. మెడికల్ సీటు సాధించిన కల్లూరు, పెనుబల్లి నిరుపేద విద్యార్థులు వైద్య విద్య నభ్యసించేందుకు ఆర్ధిక స్తోమత లేని కారణంగా పలువురి ద్వారా తన దృష్టికి వచ్చిందని వీరిని ఏ విధంగానైనా డాక్టర్లు చేయాలనే సంకల్పంతో దాతల సహాయం అందించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందని తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ షేక్

also read :-మావోయిస్టులకు పేలుడు పదార్థాలు తరలిస్తున్న నలుగురి అరెస్టు
జానీమియా, ఇద్దరు విద్యార్థులకు ప్రతి సంవత్సరం 50 వేల చొప్పున విద్య పూర్తయ్యే వరకు అందించేందుకు ముందుకు వచ్చారని, అదేవిధంగా మరో విద్యార్థికి గాయిత్రీ గ్రానైట్ యజమాని రవిచంద్ర తాను కూడా ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం 50 వేల చొప్పున వైద్య విద్య పూర్తి చేసే వరకు ఆర్ధిక సహాయానికి ముందుకు వచ్చారని,జిల్లా మహిళా ప్రాంగణ అధికారి వి.విజేత తాను కూడా ఒక విద్యార్థికి ప్రతి సంవత్సరం 50 వేల చొప్పున అందించేందుకు ముందుకు వచ్చారని, మరో ఇద్దరు విద్యార్థులకు 10 వేల రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని అందిస్తున్నామని, ఈ కార్యక్రమం స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకు రావాలని శాసనసభ్యులు అన్నారు.

also read ;-శివ మాలధారుల పాదయాత్ర

సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక, ప్రవాస భారతీయుల సహాయంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడున్నామని నిజమైన నిరుపేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో కరోనా , సమయంలో దాతల సహాయంతో దాదాపు 21 వేల మందికి సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ఒకే రోజు వెయ్యిమందితో రక్తదాన శిభిరం నిర్వహించి తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవడం జరిగిందన్నారు. కల్లూరు పట్టణంలో 9 కోట్లతో, పెనుబల్లిలో 16 కోట్లతో, సత్తుపల్లిలో 34 కోట్లతో ప్రభుత్వ వైద్యరంగ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ గ్రామం, మండలం, జిల్లా స్థాయి వరకే ఆలోచన చేస్తారని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రపంచాన్ని చూడాలని గొప్ప ఆశయాలను నిర్దేశించుకొని ముందస్తుగానే లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్ అన్నారు. పోటీ పరీక్షల విధి విధానాల పట్ల శ్రద్ధ, లక్ష్యం సాధించాలనే తపన కలిగి ఉంటే ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకాదని మన జిల్లా విద్యార్థులు నిరూపించారని కలెక్టర్ అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గురుకులాలలో పోటీ పరీక్షలకు శిక్షణనిస్తున్నదని పదవ తరగతి అనంతరం ఎటువంటి ఉన్నత విద్యనభ్యసించాలని, ఏఏ విద్యారంగాలను ఎంచుకోవాలో నిశ్చయించుకోవాలని తమకు లభించిన అవకాశాలను సద్వినియోగపర్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్న పిదప సమాజ సేవకు పాటుపడాలని కలెక్టర్ సూచించారు.

also read :-బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన తనిష్క

నీట్ పరీక్షల్లో యం.బి.బి.యస్ సీట్లు సాధించిన కనపర్తి కృష్ణవేణి, సుష్మా జానపాటి,గోట్రు నిఖిల్, ఎస్.కె.నఫీజా, వేము సాహితి, వి.అక్షర, లేక ప్రవళికలకు నగదు ప్రోత్సాహకం అందించి ఘనంగా సత్కరించారు. తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ షేక్ జానీమియా, మండల ప్రత్యేక అధికారి సునిత, మహిళా ప్రాంగణం జిల్లా అధికారి వి.విజేత, కల్లూరు ఆర్.డి.ఓ సూర్యనారాయణ, తెలంగాణ గ్రామర్ స్కూల్ వైస్ చైర్మన్ పసుమర్తి చందర్ రావు, జడ్పీ.టి.సి కట్టా అజయ్ బాబు, ఎం.పి.పి బీరవెల్లి రఘు, జడ్నీ, కో-ఆప్పన్ మెంబర్ ఎస్.కె. ఇస్మాయిల్, తహశీల్దారు జె. బాల్టిప్రసాద్, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, ఎం.ఇ.ఓ రాములు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.