అధికారం ఎవడబ్బా సొత్తుకాదు: పొంగులేటి
== రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
== నిరుద్యోగుల ఆశలు ఆశయాలు నెరవేర్చలేదు
== నోటిఫికేషన్ లు అనేకం ఉద్యోగాలు మాత్రం శూన్యం
== మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం 5 లక్షల కోట్లు అప్పుల పాలయింది
== 2018 ఎన్నికల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి ఈరోజుకి అమలు చేయలేకపోయింది
== 36 లక్షల మంది రైతు సబ్సిడీలను కేవలం 5 లక్షల మందికే చేసి 31 లక్షల మంది రైతులను వదిలేసింది
== తెలంగాణ ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తప్పకుండా తగులుతుంది
(సత్తుపల్లి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఆశలు ఆశయాలు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆశయాలు నెరవేర్చటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నోటిఫికేషన్లు వచ్చాయి కానీ ఉద్యోగులు మాత్రం ఎవ్వరికి రాలేదని, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ప్రకటిస్తున్నట్లు మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం తప్ప ఆచరణలో మాత్రం శూన్యం అని, ఇది గత హుజురాబాద్ ఎన్నికల్లో రుజువైందని సీఎం కేసిఆర్ నీ, రాష్ట్ర ప్రభత్వాన్ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
allso reAD- పొంగులేటికి ‘దయ’ చూపడం లేదా..?
ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని ఎం.ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలను ప్రజలను మోసం చేస్తూ, మీడియా ముందుకు వచ్చి నియోజకవర్గానికి వందల వేల కోట్లు ప్రకటిస్తూ, ఆచరణ మాత్రం శూన్యంగా కనబడుతుంది అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అది ఎవడబ్బా సొత్తు కాదని, మహామహులే రాజకీయాల్లో ఓటమిపాలయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2018లో ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇప్పించలేకపోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులు పాలు చేశారని, దళితుల కు దళిత బంధు అని చెప్పి నియోజకవర్గానికి ఒక్కరిద్దరికీ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఖమ్మం జిల్లాతో పాటుగా సత్తుపల్లి నియోజకవర్గంలో శీనన్న అభిమానులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. 36 లక్షల మంది రైతు సబ్సిడీలను కేవలం 5 లక్షల మందికే చేసి 31 లక్షల మంది రైతులను వదిలేసిందని విమర్శించారు. కేసిఆర్ మాటల మాంత్రికుడు అని, ఆయన మాటల గారడి కి మూల్యం చెలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. అబ్కారీ ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న ఈ ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తప్పక తగులుతుందని విమర్శించారు.
ALLSO READ- మాటలకే తప్ప చేతలు శూన్యం: పొంగులేటి