Telugu News

ప్రసాద్ రెడ్డి w/s రాయల.. అభ్యర్థి ఎవరు..?

చివరిగా తెరపైకి ఇద్దరి పేర్లు

0

ప్రసాద్ రెడ్డి w/s రాయల 

== చివరిగా తెరపైకి ఇద్దరి పేర్లు

== స్థానికతకే పెద్దపీఠ

== బెంగుళూరు లో కొనసాగుతున్న ఖర్గే తో సమావేశం. 

== ఉత్కంఠ మారిన ఖమ్మం సీటు ఎంపిక

(హైదరాబాద్ -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ సీటుకు అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి కత్తి మీద సాము గా మారింది.. నామినేషన్ ప్రక్రియ ముగింపుకు దశకు చేరుకుంటున్నప్పటికి ఖమ్మం సీటు ఎంపికపై ఇంకా పూర్తి కాలేదు. జిల్లా నుంచి కీలక నేతలు పోటీ పడుతుండటంతో నేతలు నడుమ రసవత్తర పోరు నడుస్తోంది. అభ్యర్థి ఎంపిక  అధిష్టానానికి తలనొప్పిగా గా మారింది‌. జనరల్ స్థానం కావడం ముగ్గురు మంత్రులకు చెందిన కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్ పోటీ పడుతుండగా మరో వైపు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, వీవీసీ రాజా, ఎండీ.జావిద్, వి. హనుమంత్ రావు, జెట్టి కుసుమ కుమార్ పోటీ పడుతున్నారు. ఇంతలో ఎవరు ఊహించని విధంగా మాజీ ఎంపీ తనయుడు రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఓయూ నేత లోకేష్ యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే మంత్రులు భట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందిని కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కి టిక్కెట్ కావాలని గట్టి ప్రయత్నం చేయడంతో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సాముగా మారింది. దీంతో టిక్కెట్ ప్రకటన ఆలస్యమైంది.

== ప్రసాద్ రెడ్డి లేదా రాయలకే చాన్స్

బెంగుళూరు కేంద్రంగా ఖమ్మం సీటు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు మరికొంత మంది నాయకులు పాల్గొనగా సమావేశం హాట్ హాట్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 10మంది ఆశావాహుల పేర్లను పరిశీలించిన ఖర్గే, భట్టి, పొంగులేటి చివరికి ఐదు పేర్లకు తీసుకొచ్చారు. ప్రసాద్ రెడ్డి, రఘురాం రెడ్డి, మల్లు నందిని, మండల వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు పేర్లను పరిశీలించారు. టీ బ్రేక్ అనంతరం స్థానికతను అధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అందులో కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు పేర్లను అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముందుకు పంపించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ నిర్ణయం ఫైనల్ అని సమావేశంలో తీర్మానం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రసాద్ రెడ్డి కి కాకపోతే రఘురాం రెడ్డి కి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం నాటికి ఎవరో ఒకరి పేరు ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ నుంచి సుమాచారం అందుతుంది. చూద్దాం రాహుల్ గాంధీ ఎవరిని ఆశీర్వదిస్తారో..ఎవరి పేరు ప్రకటిస్తారు..?