అకాల వర్షం…. మిరపకు నష్టం….
అకాల వర్షం…. మిరపకు నష్టం….
( చండ్రుగొండ -విజయం న్యూస్ ):
మండలంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న చిరుజల్లులు తో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు… అసలే తామర పువ్వు తెగులు, పెరిగిన పెట్టుబడులు, పెరిగిన మొక్కలు లకు సోకిన వైరస్ తో సగం దిగుబడులు పడిపోయాయి.. దిగాలుగా ఉన్న మిరప రైతులకు, అకాల వర్షం మరింత నష్టం తెచ్చి పెట్టినట్టుంది… ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో, వర్షంతో వచ్చిన పంట తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు… మండలంలో సుమారు 2300 ఎకరాల్లో మిరప పంట సాగు అయ్యింది..
also read;-ఖమ్మంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు.*
మొదటి విడతగా కాయలు ప్రస్తుతం కళ్ళల్లో ఆరబోసి ఉండగా ఉదయం నుండి కురుస్తున్న చిరుజల్లులు కు తడిసి ముద్దుగా మారుతున్నాయి… మరో రెండు రోజుల్లో మార్కెట్ కు తరలించేందుకు కుప్పలుగా పోసి ఉంచిన మిరప రాశుల సైతం తడిసి పోతుండటంతో నాణ్యత పై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పరదాలు కప్పి ఉంచిన ఈదురు గాలులకు కొట్టుకు పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మబ్బులు పట్టి ఉన్న వాతావరణం తోడు మరో రెండు రోజులపాటు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు తో రైతులు ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..