Telugu News

ఇక ప్రధాని మోడీకి మూడింది: భట్టి విక్రమార్క

హిమాచల్ లో విజయం  కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంధి

0

ఇక ప్రధాని మోడీకి మూడింది: భట్టి విక్రమార్క

== హిమాచల్ లో విజయం  కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంధి

== ఖర్గే అడుగుపెట్టిన వేళ..రాహుల్ పీఎం కావడం ఖాయం

== జోస్యం చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== దేశ సంపదనంతా గుజరాత్ కే పంపించడమే అక్కడ గెలుపుకు కారణం

== గుజరాత్ ఓటమి నుంచి త్వరలోనే మేలుకుంటాం

== విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(హైదరాబాద్, ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాంధి కాబోతున్నాయని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోందని, ఇక ప్రధాని నరేంద్రమోడీకి మూడిందని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే అడుగుపెట్టిన వేళగాభావిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించడం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు, కాంగ్రెస్ విజయం కొరకు కృషి చేసిన క్యాడర్ కు అభినందనలు.

ఇది కూడా చదవండి: సీఎంకు రాసిన ఈసీ లేఖలో ట్విస్ట్

ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ చేస్తున్న ఆకృత్యాలు, ఆరచకాలను సహించలేని హిమచల్ ప్రదేశ్ ప్రజలు బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ దేశ ప్రధాని, దేశ అధికార యంత్రాగం గుజరాత్ లో మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు ప్రచారంతో విజయం సాధించిన బిజెపిది గుజరాత్ లో నైతిక గెలుపు కాదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రధాని స్థాయి మర్చిపోయి గుజరాత్ ప్రతినిధిలా మాట్లాడారని ఆరోపించారు. డబ్బు, అధికారం, మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిందన్నారు. దేశ వనరులు అన్ని గుజరాత్ లో కుమ్మరించారని,  దేశ సందపను దోచిపెట్టిన క్రోని క్యాప్టలిస్టులను గుజరాత్ లో మోహరించి ఆనేక ప్రలోభాలు పెట్టి గెలిచిన విజయం గెలుపు ఎట్లా అవుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీపై నమ్మకంతో గుజరాతీలు ఓట్లు వేసినట్లుగా కనిపించడం లేదని ఆరోపించారు. ఎంఐఎం, ఆప్ లాంటి పార్టీలను బీజేపీ ప్రోత్సహించి లౌఖికవాద  ఓట్లు చీల్చి గుజరాత్ లో గెలిచారని స్పష్టం చేశారు. ఆప్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్లుగా మీడియా లో బిజెపిలో ప్రచారం చేయించి లబ్ధి పొందారని అన్నారు. ఓక ప్రధాని తన స్థాయిని దిగజార్చుకొని ఓక ఎన్నిక కోసం ఓక రాష్ట్రంలో 36 సభలకు పైగా పాల్గొన్న దుష్టాంతం దేశంలో ఇప్పటి వరకు చూడలేదన్నారు. దేశాన్ని పాలించే ప్రధాని దేశాన్ని ఒకే విధంగా చూడాలే  తప్పా, ఒక ప్రాంతం వాడి కుంచిత సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. తాను భూమి పుత్రిడిని అంటూ గుజరాత్ లో మోడీ  భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారని అన్నారు. ఎంఐఎం, ఆప్ పార్టీలు బీజేపీ ట్రాప్ లో పడి గుజరాత్ ఎన్నికల్లో  బీజేపీ కి సహాకరించాయని అన్నారు.

ఇది కూడా చదవంఢి: హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ ఫలితాలు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం చేసే యాత్ర కాదని, దేశ విచ్చిన్నకర శక్తులను నుంచి దేశాన్ని ఐక్యం కొరకు చేస్తున్న పాదయాత్ర అని అన్నారు. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర నడుస్తున్నదని, ఎన్నికల కోసం ఆయన పాత్ర రూట్ ను మార్చుకోవడం లేదన్నారు. అది కదా నిబద్దత అని అన్నారు. గుజరాత్ ఓటమికి మొన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టిన ఖర్గే భాధ్యుడు కాడని, అలా అంటే హిమాచల్ ప్రదేశ్ లో అద్భుతమైన విజయం సాధించింది కదా..? అని అన్నారు.  గుజరాత్ ఓటమికి కాంగ్రెస్ మొత్తం భాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకంపై కసరత్తు జరుగుతుందని అన్నారు.. కమిటీల ఏర్పాటుపై నా అభిప్రాయం కూడా నేను చెప్పానని తెలిపారు. సీనియారిటీ, అనుభవం క్రైటిరియా ప్రకారమే కమిటీల్లో స్తానం కల్పించాలని చెప్పానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పార్టీలోనే ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని స్పష్టం చేశారు.