ప్రధాన మోడీ సంచలన నిర్ణయం.
రైతులకు కార్తీక పౌర్ణమి శుభవార్త.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం.
( తెలంగాణ ప్రతినిధి – విజయంన్యూస్) :-
రైతు ఆందోళనతో వ్యవసాయ చట్టాల పై వెనక్కి తగ్గిన కేంద్రం.
మూడు వ్యవసాయ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం.
అధికారికంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.
రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ.
వ్యవసాయ బడ్జెట్ ను ప్రధాని మోడీ తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నమన్న మోడీ.
రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని
నిరంతరాయ పోరాటాల ఫలితమేనన్న ప్రతిపక్షాలు
రైతులకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ..అఖిలపక్షపార్టీలు
రైతులకు శుభాకాంక్షలు చెబుతున్న యావత్తు దేశం
ఢిల్లీలో రైతు శిబిరంలో సంబారాలు..
*నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం: మోదీ
దిల్లీ:- సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని అన్నారు.
‘‘2014 లో నేను తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం కల్పించింది. మన దేశంలో 80శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉంది. అదే వారికి జీవనోపాధి. అన్నదాతల కష్టాలను నేను దగ్గరుండి చూశాను. అందుకే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం. ఫసల్ బీమా యోజన్ను మరింత బలోపేతం చేస్తాం’’ అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
Alldo read:- ఖమ్మం జిల్లాలో భారీగా దరఖాస్తులు…122 దుకాణాలకు 6213 దరాకాస్తులు
Allso read :- గవర్నర్ కు వినతి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.