Telugu News

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటన

ప్రధాని నరేంద్ర పర్యటన వేళ బిఆర్‌ఎస్‌ నిరసనలు

0

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటన

== ప్రధాని నరేంద్ర పర్యటన వేళ బిఆర్‌ఎస్‌ నిరసనలు

== సింగరేణి వ్యాప్తంగా 8న ఆందోళనలకు పిలుపు

(హైదరాబాద్‌-విజయంన్యూస్)

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తెలంగాణరాష్ట్రంలో పర్యటించనున్నారు..  వందేభారత్ రైలు ప్రారంభంతో పాటు పలు  అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ లో రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌ పర్యటను వ్యతిరేకించాలని బిఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది.ఇక అదే రోజు  సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ అరెస్ట్ మాత్రమే..? జైలుకు పంపలేదు..?

రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో మహాధర్నాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఒకే రోజు  ప్రధాని మోడీ పర్యటన, బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో  రాష్ట్రంలో రాజకీయం వాతావరణ మరోసారి వేడెక్కనుంది. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో రామగుండలో  మోడీ మాట తప్పారని విమర్శించారు కేటీఆర్‌.  వేలం లేకుండా బొగ్గగనులను  కేటాయించాలని డిమాండ్‌ చేశారు.  లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌  సంకల్పాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన ధ్వజమెత్తారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే సింగరేణి జంగ్‌ సైరన్‌ మోగిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.