Telugu News

ప్రియాంకగాంధీ సంచలన నిర్ణయం

== బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అంటూ ప్రకటన

0

ప్రియాంకగాంధీ సంచలన నిర్ణయం
== బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అంటూ ప్రకటన
(లక్నో-విజయంన్యూస్)
బీజేపీ పార్టీ తప్ప మిగిలిన ఏ పార్టీతోనేనా పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని సోనియాగాంధీ కూతురు ప్రియాంకగాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె స్పష్టం చేశారు. బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే యూపీ సిఎం అభ్యర్థిని నేను కాదని, పార్టీ ఎవర్ని నిర్ణయిస్తే వారు అభ్యర్థిగా ఉంటారని ప్రియాంకగాంధీ స్పష్టం చేశారు. అందరూ పదే పదే అదే ప్రశ్న అడిగే సరికి అంతటా నన్నే చూస్తారని… చికాకులో చెప్పానన్నారు.

also read :-తెలంగాణకు వర్ష సూచన

యూపీ ముఖ్యమంత్రి 80 పర్సెంట్‌ వర్సెస్‌ 20 పర్సెంట్‌ అని చెబుతున్నారని, కానీ.. వాస్తవం మాత్రం 99 పర్సెంట్‌ వర్సెస్‌ వన్‌ పర్సెంట్‌ అన్నారు. యూపీ సహా… దేశంలో కేంద్రంలో సన్నితంగా ఉండే వారు… బడా వ్యాపారవేత్తలు మాత్రమే.. లబ్ది పొందుతున్నారన్నారు. ప్రజలందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. యూపీలో నిరుద్యోగుల శాతం గురించి ఎందుకు మాట్లడట్లేదు… విద్యారంగంపై యూపీ కేటాయిస్తున్న బ్జడెట్‌ గురించి ఎందుకు మాట్లడట్లేదని ప్రశ్నించారు. యూపీ సమస్యలపై కాకుండా… అనవసరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారన్నారు ప్రియాంక. ఙఖ ఎన్నికల తర్వాత పొత్తుల గురించి స్పందించారు. బీజేపీ తప్ప… అన్ని పార్టీలను కాంగ్రెస్‌ స్వాగతిస్తుందన్నారు ప్రియాంక..