నన్పూర్ లో నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు పట్టివేత:
(నస్పూర్–విజయం న్యూస్):
శ్రీరాంపూర్ కాలనీ లో నిషేధిత గుట్కా ఉత్పత్తులు పట్టుకున్నట్లు శ్రీరాంపూర్ సిఐ రాజు తెలిపారు.శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ కాలనీ లోని హిమ్మత్ నగర్ కు చెందిన రాయపూడి నాగేశ్వరరావు అనే వ్యక్తి రూ. 1లక్షా 35 వేల 800లు విలువగల నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు ఎస్ఐ సౌజన్య, పోలీస్ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
also read ;-మేడారం జాతర విజయవంతానికి అందరూ సహకరించాలి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
నిందితుడిపై కేసు నమోదు చేసి నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితునికి సహకరించిన వారిపై కూడా విచారణ చేపడతామని, ఎక్కువ సార్లు కేసులు నమోదయితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ కె. సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జి. శ్రీనివాస్, సంపత్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు