పదోన్నతి పొందిన ఉల్లోజు శ్రీనివాస్
== అభినందించిన టీజేఎఫ్ జిల్లా కమిటీ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం (నూతన కలెక్టరేట్) పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ పదోన్నతి పొందిన వల్లోజు శ్రీనివాసులు ను టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకులు అభినందించారు. అదనపు పౌర సంబంధాల శాఖ అధికారిగా ఖమ్మం జిల్లాలోనే నియమించడంపై పట్ల టియుడబ్ల్యూజే నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పదోన్నతి పొంది, ఉన్నచోటనే పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వల్లోజు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపి, అభినందిస్తూ ఆయనకు పుష్ప గుచ్చం అందించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల మరింత అంకితభావంతో పనిచేయాలని, ఎల్లవేళలా పాత్రికేయులకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే నాయకులు వల్లోజుకు సూచించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు సాంబశివరావు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, టెంజూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజనీకాంత్, ఇతర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్