Telugu News

తెలంగాణలో ఐపీఎస్ లకు పదోన్నతులు

తెలంగాణలో ఐపీఎస్ లకు పదోన్నతులు

0

తెలంగాణలో ఐపీఎస్ లకు పదోన్నతులు

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐజి లుగా పనిచేస్తున్న వై. నాగిరెడ్డి, డిఎస్ చౌహాన్, విజయ్ కుమార్, సంజయ్ కుమార్ జైన్ లకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించారు.

also read :-★ ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

డిఐజి లుగా పనిచేస్తున్న శివకుమార్, చంద్రశేఖర్ రెడ్డి, కమలాసన్ రెడ్డి, ఏ. ఆర్. శ్రీనివాస్ లకు ఐజీగా పదోన్నతి కల్పించారు. ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న తస్ఫీర్ ఈక్బాల్ కు డిఐజీ గా కల్పించారు. ఎస్పీగా పని చేస్తున్న అంబర్ కిషోర్ జా, రమా రాజేశ్వరి లకు సెలక్షన్ గ్రేడ్ ఏస్పీ గా పదోన్నతి కల్పించారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటి క్లియరెన్స్ ఇవ్వడంతో ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జీవో విడుదల కానుంది