Telugu News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసన

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సి ఎల్ పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క పిలుపుమేరకు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ ఆధ్వర్యంలో మధిర లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించటం జరిగింది.

0

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసన
(మధిర/ఖమ్మం-విజయంన్యూస్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సి ఎల్ పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క పిలుపుమేరకు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ ఆధ్వర్యంలో మధిర లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్,కరెంట్ ధరలుపెంచి పేదవాడి నడ్డి విరిచిందని ,యాసంగీ ధాన్యం మొత్తాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి నీ విడనాడి రైతులకు, నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ ప్రజలను నమ్మించి మోసంచేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పేదలు,రైతుల పక్షాన పోరాడుతుందని , వరుస నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఢిల్లీ లో దోస్తీ, గల్లీ లో కుస్తీ లాగా.. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తున్నారని…అన్నారు…

also read :-బండ నెత్తిన…బాధలు గుండెల్లో

ఈ కార్యక్రమంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మున్సిపాలిటీ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర రావు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మండల గాంధీ పదం అధ్యక్షుడు బోడేపూడి గోపి పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ అలీ కాంగ్రెస్ నాయకులు,డివిజన్ అధ్యక్షులు బాలు నాయక్, భానోతు రమణ నాయక్, షేక్ షన్ను, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి వాసంశెట్టి జనార్దన్ రావు, మొదలగు వారు పాల్గొన్నారు