Telugu News

ప్రొటోకాల్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందే : నామా

ప్రజాప్రతినిధులకు, అధికారులకు జవాబుదారితనం ఉండాలి

0

ప్రొటోకాల్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందే: నామా

== ప్రజాప్రతినిధులకు, అధికారులకు జవాబుదారితనం ఉండాలి

== తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది

== పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

?దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై చర్చ

== పలువుర్ని పరామర్శించిన ఎంపీ నామా

ఖమ్మం, నవంబర్ 26(విజయంన్యూస్) :

ప్రభుత్వ పనులకు, సమావేశాలకు ప్రతి ఒక్కరు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన దిశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశంలో నామ పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నామ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.ఈ సందర్బంగా నామ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాధ్యతతో పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మరో ముఖ్యమైన విషయం ప్రోటోకాల్ అన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణా పై కేంద్రానికి వివక్షతేందుకు..?: నామ

అందరూ తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించి తీరాలన్నారు.8 ఏళ్లలో తెలంగాణ అనూహ్యంగా అభివృద్ధిని సాధించి, అవార్డుల పంట పండిస్తుందన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి వల్ల వాటి రూపు రేఖలు మరిపోయాయని అన్నారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ కు వచ్చిన అవార్డులేనన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై ఎంపీ నామ సంబంధిత అధికారుల చేత సవివరణ ఇప్పించారు.ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిస్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నామ సంబంధిత అధికారులను ఆదేశించారు.వచ్చే సమావేశం నాటికి సమస్యలు పరిష్కారం చేసేలా చూడాలని నామ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే లు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మీ, కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

== పలువుర్ని పరామర్శించిన నామా

టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరం తో పాటు  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరమర్శించారు. ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం లో మాదాసు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు.

ఇది కూడా చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్

తర్వాత రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఉషాహారి కన్వెన్షన్ & శ్రీశ్రీశ్రీ ఎక్స్ లెన్సీ ను  ఎంపీ నామ ప్రారంభించారు.ప్రమాదవశాత్తు గాయపడి ముస్తఫానగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గౌడ సంఘం నాయకులు అమరగాని వెంకన్న (పోలీస్ వెంకన్న) ను కూడా పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు .అనంతరం ఖమ్మం  పాకబండ బజారు లో అనారోగ్యంతో బాధపడుతున్న పాకాలపాటి మణికుమార్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ ,ఖమ్మం మేయర్ నీరజ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ ,  కార్పొరేటర్లు   మనోహర్ , బుడిగం శ్రీను , ఈశ్వర ప్రగాఢ ఉషా రాణి హరి బాబు , బాబ్జి , పాల్వంచ రామారావు , ధర్మ నాయుడు , పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు , రఘునాథపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరునాయక్ ,బిచ్చాల తిరుమలరావు, మందడపు సుధాకర్ , బ్రహ్మారెడ్డి , వెంకటేశ్వర రెడ్డి , ప్రభాకర్ , రమేష్ , టెలికాం సలహా మండలి సభ్యులు ఉప్పనూతల నాగేశ్వరరావు , నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, టీఆర్ఎస్ మధిర నియోజక వర్గ మీడియా ఇంచార్జ్ తన్నీరు హరీష్,  తదితరులు పాల్గొన్నారు.