పీఎస్ఎల్వీ విజయం దేశానికే గర్వకారణం
== ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయం
== మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు
ఖమ్మం ప్రతినిధి, జూన్ 30(విజయంన్యూస్)
పీఎస్ఎల్వీ సీ 53 మిషన్ సక్సెస్ గా ముందుకు వెళ్లడం కచ్చితంగా దేశానికే గర్వకారణమని, ఇది దేశప్రజల విజయంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లతుందని మంత్రి చెప్పారు. ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని మంత్రి అజయ్ ఆకాంక్షించారు.
allso read- మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి పువ్వాడ
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. నింగిలోకి మూడు గ్రహాలు.. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్ డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన పిదప వాహకనౌక నింగిలోకి పయనించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) వాణిజ్య పరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంది. ఎన్‌ఇయూఎస్‌ఏఆర్ అనేది ఎస్‌ఏఆర్ పేలోడ్‌ను మోసుకెళ్లే సింగపూర్‌కు చెందిన మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం.
allso read- ఖమ్మంలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం