ఖమ్మంలో లక్ష మందితో బహిరంగ సభ: బండి సంజయ్
== సర్దార్ పటేల్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానల పరిశీలన
== సువిశాలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో సభ నిర్వహణకే బండి సంజయ్ మొగ్గు
== కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు భరోసా కల్పించేందుకు 15న సభ నిర్వహిస్తున్నామన్న బండి సంజయ్
== సభను సక్సెస్ ద్వారా ఖమ్మంలో బీజేపీ దమ్మెంతో చూపిస్తామని వెల్లడి
== పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడిన బండి సంజయ్
== స్థానిక సునీల్ కేఫ్ లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ సేవించిన బండి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు.
ఇది కూడా చదవండి:- సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి
అందులో భాగంగా లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి స్థానిక సర్దార్ పటేల్ గ్రౌండ్ తోపాటు ఆ పక్కనే ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానాలను పరిశీలించారు. తొలుత పటేల్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పినప్పటికీ ఆ తరువాత బీజీఎన్నార్ మైదానం పరిశీలించాక ఆ మైదానంలోనే సభ నిర్వహించేందుకు మొగ్గు చూపారు. అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బండి సంజయ్ కుమార్ సువిశాలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి:- కేసీఆర్….ఇక కాస్కో..: బండిసంజయ్
ఈ సందర్భంగా ఆయా మైదానాల పరిశీలన సందర్భంగా అక్కడే పిల్లలతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు వద్దకు వచ్చి స్థానిక సునీల్ కేఫ్ లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాగారు. ఈ సందర్భగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…. ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఖమ్మం డిగ్రీ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ఏర్పాట్లను పరిశీలించడానికే ఇక్కడికి వచ్చాం. అన్నింటికీ అనుకూలమైన మైదానం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేస్తాం. ఖమ్మంలో బీజేపీ సత్తా, దమ్ము చూపడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జరిగిన సన్నాహక సమావేశంలో కార్యకర్తల జోష్ చూస్తే లక్ష మందిని మించి సభకు హాజరయ్యే అవకాశముంది. ఖమ్మం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నా. దేశం కోసం, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపాలని కోరుతున్నా.
ఇది కూడా చదవండి:- ప్రధాని అంటే సీఎం కు లెక్కలేదా..?: బండి సంజయ్
బీజేపీ కార్యకర్తలంతా పోలింగ్ బూత్ ల వారీగా ప్రచారం చేయాలి. సభకు తీసుకురావాలి. జన సమీకరణపై రాష్ట్ర సీనియర్ నాయకులతో ఓ కమిటీని వేయబోతున్నాం. నిరుద్యోగ మార్చ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో మీరంతా చూశారు… అమిత్ షా బహిరంగ సభను ఇతర జిల్లాల్లో నిర్వహించాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి, బీజేపీ దమ్మేందో చూపడానికే ఇక్కడ సభ నిర్వహించాలని నిర్ణయించాం. కార్యకర్తలు, యువత ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుతున్నమన్నారు.
== బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ….
బీజేపీ నాయకత్వం ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ జిల్లాలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలనుండి ప్రజా ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణలోని ఏ జిల్లాకు తక్కువ కాకుండా ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేస్తామనే సంకేతాలు వెళ్లేలా సభను సక్సెస్ చేయాలి.
== తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…..
ఖమ్మం విశిష్టమైన, విలక్షణమైన జిల్లా. ఇక్కడికి అమిత్ షా రానున్న నేపథ్యంలో సభను సక్సెస్ చేయాలి. ఈ జిల్లాలో కమ్యూనిస్టులు పరిగ ఏరుకునే దుస్థితి. కాంగ్రెస్ నేతలది అమ్ముడుపోయే రకం. కమ్యూనిస్టు పార్టీల్లో ఒకాయన కేసు కోసం, ఇంకోకాయన సీటు కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారు. జిల్లాలోని కొందరు నేతలు అటు ఇటు ఊగిసలాడుతున్నారు.
ఇది కూడా చదవండి:- కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి : బండి సంజయ్
వీళ్లందరికీ స్పష్టమైన సంకేతాలు పంపేలా అమిత్ షా సభను విజయవంతం చేయాలి. బండి సంజయ్ పాదయాత్ర, నిరుద్యోగ స్పూర్తితో సభను దిగ్విజయవంతం చేయాలి. కొన్ని దుష్టశక్తులు, ఓ సెక్షన్ మీడియా బండి సంజయ్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవేమీ పనిచేయవు. ఇది కురుక్షేత్రం. బండి సంజయ్ చిరుతపులి. దైవబలమున్న నేత. అమ్మవారి ఆశీస్సులతో విజయభేరీ మోగించడం సాధ్యం. 18 కోట్ల సభ్యత్వమున్న బీజేపీ కేసీఆర్ ఉడత ఊపులకు భయపడదు…ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిషాన్ మోర్చా కిషన్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధానా కార్యదర్శులు నున్నారావి, శ్యామ్ రాథోడ్ తదితరులు హాజరైయ్యారు.