Telugu News

పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలి: కందాళ

పాలేరులో మరుగుదొడ్లను ప్రారంభించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి..

0

పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలి: కందాళ

== పాలేరులో మరుగుదొడ్లను ప్రారంభించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి..

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలం, పాలేరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ను ఎమ్మెల్యే కందాళ  ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. జనరల్ పండ్స్ తో నిర్మాణం చేసిన మరుగుదొడ్లను  ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సాధారణంగా ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ లను అవాయిడ్ చేస్తా ఉంటారని,  పరిశుభ్రత లోపం, పబ్లిక్ టాయిలెట్స్ ప్రాంగణం శుభ్రంగా లేకపోవడం వల్ల ప్రజలు దూరంగా ఉంటారని అన్నారు. అందుకే ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. తద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, టాయిలెట్లు ఎప్పటికి అప్పుడు శుభ్రంగా ఉంచాలని సర్పంచ్ యడవల్లి మంగమ్మను  కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీలం ఉపేంద్రమ్మలచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ తదితరులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: “కందాళ”కు పరీక్షే నా..?