Telugu News

కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమపాలన: మల్లు నందిని

చింతకాని మండలంలో గడప- గడపకు కాంగ్రెస్ పాదయాత్రను ప్రారంభించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

0

కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమపాలన: మల్లు నందిని

== చింతకాని మండలంలో గడప- గడపకు కాంగ్రెస్ పాదయాత్రను ప్రారంభించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

(చింతకాని/ఖమ్మం-విజయంన్యూస్)

కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమ పాలన వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా  చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో గడప- గడప ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమ్మ పౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. మొదటిగా రామ కృష్ణాపురం గ్రామంలో, గాంధీనగర్  గ్రామంలో మండల  కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ తో కలిసి  గడప – గడపకు కాంగ్రెస్ ప్రచారం చేస్తూ… రైతు డిక్లేషన్ వివరణ ఇచ్చారు.

ఇదికూడా చదవండి: కూసుమంచిలో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

వారు మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలు, ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.15 వేలు భూమిలేని ఉపాధి కూలీలకు ప్రతి ఏడాదికి రూ.12 వేలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర  రూ.2500 ధరణి  పోర్టల్ రద్దు. ఇంటి నిర్మాణం కోసంరూ.5 లక్షలు, ఆరోగ్యశ్రీ కి రూ.5 లక్షల ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారనీ,  కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు చేసిన అభివృద్ధి ఫలాలు, టిఆర్ఎస్ పార్టీ హాయంలో ప్రస్తుతం చేస్తున్న అవినీతి అరాచకాలను గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పందిళ్ళపల్లి  ఎంపీటీసీ ఓర్స్ వీరభద్రం,  చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి  వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, మండల కాంగ్రెస్ పార్టీ  అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బందెల నాగార్జున, కిసాన్ సెల్ అధ్యక్షుడు కొప్పుల గోవిందరావు, బీసీ సెల్ అధ్యక్షులు సట్టు వెంకటేశ్వర్లు, గాంధీనగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు వంగూరి రమేష్,తిరుపతి గోవిందరావు , తూము అంజయ్య, కొర్లపాటి అంజయ్య, ఉసికల లక్ష్మి నారాయణ, గాదె రామారావు, తిరుపతి యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో కష్టపడేవారికి పదవులు రావడం ఖాయం