Telugu News

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – పొంగులేటి

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి

0

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – పొంగులేటి

(ఏన్కూరు-విజయం న్యూస్):
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఉభయ కమ్యూనిస్టులు టిడిపి- టీజేఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయన్నికాంక్షిస్తూ నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పోగులేటి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి దేశస్థాయికి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని అన్నారు.

ఇది కూడా చదవండి:- రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందిద్దాం..: పొంగులేటి 

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎన్నికల అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడుభూముల పట్టాలిస్తామని,ఇందిరమ్మ ఇళ్లు,పింఛన్లు,రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్న అడిగిన మేరకు బోర్లు వేసుకున్న పొడు రైతులకు కరెంట్, మోటర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.ప్రజలను మాయమాటలతో మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు కేంద్రంలో బిజెపి ,రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయి కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని, హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ రోడ్ లో అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మలోతు రాందాస్ నాయక్ , బాలసాని లక్ష్మీనారాయణ, బొర్రా రాజశేఖర్, పిడమర్తి రవి, స్వర్ణ కుమారి, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, స్వర్ణ నరేందర్, వేముల కృష్ణ ప్రసాద్, వీరభద్రం నాయక్, విజయ భాయ్, ప్రభావతి రెడ్డి, ఆనంద్ ప్రసాద్, రంజిత్ కుమార్, లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరు ప్రధాన సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్ షోకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఇది కూడా చదవండి:- ఏన్కూరులో పది పరీక్షల్లో సర్కార్ బడులదే హవ్వా