ధాన్యం, మొక్కజొన్నలను త్వరగా కొనుగోలు పూర్తి చేయాలి: కలెక్టర్
అధికారులకు ఆధేశించిన కలెక్టర్ వి.పి.గౌతమ్
ధాన్యం, మొక్కజొన్నలను త్వరగా కొనుగోలు పూర్తి చేయాలి: కలెక్టర్
== ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలి
== అధికారులకు ఆధేశించిన కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం, మే 29(విజయంన్యూస్):
ధాన్యం, మొక్కజొన్న సేకరణలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్ మిల్లులకు రవాణా అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 236 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు, ఇప్పటి వరకు 198 కేంద్రాల ద్వారా 14,954 మంది రైతుల నుండి 122619.240 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చెందినట్లు ఆయన తెలిపారు. 120045.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత మిల్లులకు తరలించినట్లు ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు చేద్దాం: మంత్రి
ఇప్పటి వరకు 2270 మంది రైతులకు 31 కోట్ల 65 లక్షల 32 వేల 496 లు ధాన్య మొత్తం వారి వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆన్లైన్ నమోదులు వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. రవాణాకు వాహనాల ఏర్పాటు వెంట వెంటనే చేపట్టాలన్నారు. ధాన్య సేకరణ ఎక్కువగా జరుగుతున్న కేంద్రాల వద్దకు అవసరమైన లారీల ఏర్పాటు చేయాలన్నారు. గన్నీ బ్యాగులు అవసరమైన చోట ముందస్తుగా అందజేయాలన్నారు.
జిల్లాలో 44 మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ప్రతిపాదించి, ఇప్పటికి 37 కేంద్రాలను పారంభించినట్లు తెలిపారు. 31 కొనుగోలు కేంద్రాల్లో 5,331 మంది రైతుల నుండి 31913.953 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎఫ్ఏక్యూ ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు. కేంద్రాల వద్ద రైతులు, హమాలీలకు నీడకు షామియానా, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ధాన్యం, మొక్కజొన్నల దిగుబడిని బట్టి కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు ముందస్తుగా ఇండెంట్ చేసుకోవాలని, లారీలు వెంటనే వచ్చేలా అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులకు ఏ దశలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు..
ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, డిఆర్డీవో విద్యాచందన, డిసిఓ విజయ కుమారి, డిసిఎస్ఓ రాజేందర్, ఆర్టీవో కిషన్ రావు, డిఎంసీఎస్ సోములు, డిఎం మార్క్ ఫెడ్ సునీత, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు రాజేశ్వర రావు, అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.