Telugu News

రౌడీషీటర్లను పక్కన పెట్టుకొనేది మీ నాయకులే

** చేతనైతే అభివృద్ధి పై మాట్లాడండి.

0

రౌడీషీటర్లను పక్కన పెట్టుకొనేది మీ నాయకులే
** చేతనైతే అభివృద్ధి పై మాట్లాడండి.
** మంత్రి పై కాంగ్రెస్ వారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.
** విలేకర్ల సమావేశంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు , మైనార్టీ నేతలు
(ఖమ్మం-విజయన్యూస్);-
కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని,దీంతో పాటు అభివృద్ధి లో సలహాలు సూచనలు అందించాలని,అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లా ను అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర మంత్రి,ఖమ్మం ఎం.ఎల్.ఏ.పువ్వాడ అజయ్ కుమార్ పై అవాక్కులు,చేవాక్కులు పేలితే సహించేది లేదని పలువురు టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు,నాయకులు హెచ్చరించారు.

also read :-షార్ట్ సర్క్యూట్తో యువ రైతు మృతి.

పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్ లో శుక్రవారం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం డి.తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఖమ్మంజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి.ఖమర్, ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎస్.కె.మక్బుల్,ఎస్.కె.శౌకత్ అలీ, సుడా డైరెక్టర్ ఎస్.కె.ముక్తార్,పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఇసాక్ లు మాట్లాడుతూ మంత్రి పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల ను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా రాజకీయ లబ్దికోసం,పత్రికల్లో ప్రచారం కోసం మంత్రి పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం ఎవరికీ చుట్టం కాదని,తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం శిక్షించే తీరుతుందన్నారు.దీనిలో భాగంగానే పోలీసులు తమపని తాము చేశారని వివరించారు.

దీనికి ఆపార్టీ నేతలు మంత్రి కి ఆపాదిస్తూ,పోలీసు స్టేషన్లు టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలు గా మారిపోయాయని ఆరోపించడం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం,శాంతి భద్రతల ను కాపాడేందుకు తమ పార్టీ నాయకులు ఆయా శాఖల అధికారులకు తప్పకుండా సహకరిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వారు ఎవరిగురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పై రౌడీషీట్ నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నని గుర్తు చేశారు. అటువంటి వారు అతని కోసం మంత్రి పై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు తనాన్ని తెలియజేస్తుంద ని ధ్వజమెత్తారు. ఖమ్మం నగరంలో అద్దెకు ఇల్లు ఇవ్వని అటువంటి నాయకులను పక్కన పెట్టుకొని మంత్రి పై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.ఖమ్మం నగరానికి పట్టిన చీడ లాంటి అటువంటి వ్యక్తులకు అండగా ఉండి ఖమ్మం ను అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్న మంత్రి పై ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

also read :-ఆయనో తహశీల్దార్ కానీ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు

రాజకీయాలు ఎన్నికల్లో చేయాలని,తరువాత రాజకీయ పార్టీ ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పని చేయాలని సూచించారు.ఇప్పటికే గత ఎన్నికల్లో వారికి ఇచ్చిన సీట్లను చూసైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రం లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మంత్రి చేస్తున్న అభివృద్ధి లో కలిసి రావాలని హితవు పలికారు.ఈ విలేకర్ల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నగర ప్రచార కార్యదర్శి ఎస్.కె.షకీనా,ఖమ్మం షాదీఖానా చైర్మన్ ఎం.డి.మజీద్,డైరెక్టర్ ఎం.డి.సలీం,మైనార్టీ విభాగం జిల్లా,నగర నాయకులు ఎం.డి.ఆజామ్,ఎం.డి.ఖయ్యుం, ఎం.డి.యాకుబ్,ఎస్.కె.అబ్బాస్,ఎస్.కె.ఆన్వర్,ఎం.డి.మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.