Telugu News

పుట్టిక కాంగ్రెస్..చావు కాంగ్రెస్..: చరణ్ రెడ్డి

రాంరెడ్డి చనిపోయినప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు

0

పుట్టిక కాంగ్రెస్..చావు కాంగ్రెస్..: చరణ్ రెడ్డి

== కార్యకర్తల ధైర్యం రాంరెడ్డి వెంకట్ రెడ్డి

== రాంరెడ్డి చనిపోయినప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు

== ఆత్మీయ సమ్మేళనంలో రాంరెడ్డి చరణ్ రెడ్డి

== పాలేరు  నుంచి పార్టీ శ్రేణులు హాజరు

(ఖమ్మం రూరల్ –విజయంన్యూస్):

 చనిపోయిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అని రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రాంరెడ్డి శ్రీ చరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టి. సి .వి రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు అభిమానుల ఆత్మీయ సమ్మేళనం బైరు హరినాథ్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అక్కడ ఏర్పాటుచేసిన చిత్రపటానికి పెద్ద ఎత్తున హాజరైన అభిమానులునాయకులు పూలు వేసి ఘన నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: అభ్యర్థులు ఎవరైనా పార్టీ గెలుపే లక్ష్యం: పువ్వాళ 

అదేవిధంగా రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చరణ్ రెడ్డి మాట్లాడుతూ… కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినా ఆగుతారేమోగాని కార్యకర్తకు కష్టం వస్తే అర సెకను కూడా ఆలస్యం చేసేవారు కాదన్నారు. శత్రువు సైతం సాయం కోసం వస్తే కాదు అనకుండా తోడ్పాటుగా నిలిచిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో  వెంకన్న పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. లంబాడి సోదరీ సోదరీమణులు వెంకన్న అంటూ ఆప్యాయంగా పిలుచుకునే వారని ఆయన కూడా అదే ఆప్యాయత అనురాగాలను పంచేవారని గుర్తు చేసుకున్నారు. వెంకట్ రెడ్డి అంటే వ్యక్తి కాదు ఓ శక్తి ఇప్పటికీ. ఎప్పటికీ ప్రజల గుండెల్లో తన స్థానం పదిలమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన నాడే మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. మా పుట్టుక కాంగ్రెస్ మా చావు కూడా కాంగ్రెస్ తోనే ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం అభిమానులు నాయకులు మాట్లాడుతూ రాంరెడ్డి వెంకట్ రెడ్డి తో ఉన్న అనుబంధంప్రజల పట్ల ఆయన చూపే నిబద్ధతగ్రామాల అభివృద్ధికై చేసిన కృషిని యాది చేసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి సుమారు 4000 మంది అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంరెడ్డి గోపాల్ రెడ్డిజిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధా కిషోర్వెంకట్ రెడ్డి అభిమాని నంద్యాల రవీందర్ రెడ్డిజడ్పిటిసి బెల్లం శ్రీనుమహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పందిరి పద్మావతిసర్పంచులు ఎరసాని శివారెడ్డముత్యం చిన్న కృష్ణారావుగోనే భుజంగ రెడ్డిమౌనికరాజుగూగులోత్ మోహన్లోడిగా వెంకటరమణధరావత్ వెంకట్ఉపేందర్ఖాదర్ బాబుఎంపిటిసి లింగయ్యపాలేరు నాయకులు మట్ట గురవయ్యమద్ది వీరారెడ్డిబోడ వెంకన్నకందుకూరి వెంకటనారాయణ,  కొర్ని సీతారాములుబానోతు కిషోర్ నాయక్భూక్య సురేష్ నాయక్హరి నాయక్ఆరంపుల రామయ్యబోయిన వేణుపాపా నాయక్,పాలేరు యువజన కాంగ్రెస్ నాయకుడు దారావత్ నరేష్ నాయక్బాసు నాయక్మంచా నాయక్కరీంశ్రీశైలంచింతలపాటి రాజశేఖర్భూక్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు.