కనులపండుగగా ‘పువ్వాడ’ వారి వివాహ రిసెప్షన్
▪️జన సంద్రాన్ని తలపించిన వేడుక.
▪️వెల్లల్లో హాజరైన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..
▪️మంత్రి తనయుడు నయన్, అపర్ణ ల వివాహ రిసెప్షన్ తో మురిసిన ఖమ్మం..
ఖమ్మంప్రతినిధి,ఆగస్టు 23(విజయంన్యూస్)
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంతలక్ష్మీ దంపతుల తనయుడు డాక్టర్ పువ్వాడ నాయన్ రాజ్, అపర్ణ ల వివాహ రిసెప్షన్ వేడుక వైభోపేతంగా జరిగింది.. మంగళవారం ఖమ్మం టేకులపల్లిలో మమత ఎడ్యుకేషనల్ సంస్థల స్థలంలో జరిగిన రిసెప్షన్ వేడుక అత్యంత కనులవిందుగా జరిగింది. ఈ వేడుకలకు వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు.
ఇది కూడ చదవండి: కల్యాణం..కమనీయం..పువ్వాడ వారి పరిణయం
కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. తాతయ్య, నాయనమ్మ పువ్వాడ నాగేశ్వర రావు, విజయలక్ష్మి దంపతుల ఆశీర్వాదంతో జరిగిన వేడుకలో నూతన దంపతులు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్, అపర్ణ లను హాజరైన అతిరథమహారథులు మనసారా ఆశీర్వదించి, తమ దీవెనలు అందించారు.వేడుకకు హాజరైన అతిథులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భోజన ప్రాంగణంలో టీమ్స్ ను నియమించి భోజనం వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరు కావడంతో అందుకు తగ్గ ఎర్పాటు నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు వేడుక ప్రధాన మండపం వివిధ రకాల పూలతో అలకరించడంతో వేదిక ప్రాంగణం అబ్బురపడే విధంగా ఉంది. పూల పరిమళాలు ప్రత్యేక ఆకరణలతో రిసెప్షన్ వేదికను సిద్ధం చేయడంతో పూలతోటను తలపించాయి. ఈ నెల 20న హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల జీఎంఆర్ ఆరేనా లో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం విదితమే. కళ్యాణ తంతు పూర్తయిన నేపథ్యంలో నేడు రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి పువ్వాడ. ఖమ్మం ప్రజల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ నందు సుమారు 20 వేల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా 30 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చి పోయే అతిథులకు ఎక్కడ చిన్న ఇబ్బంది కలుగకుండా అదనపు డీసీపీ బోస్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివాహ రిసెప్షన్ నకు నూతన దంపతులు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చి వేడుక ముగిసిన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారు…
ఇది కూడ చదవండి : రాజమౌళి దర్శకత్వంపై ఆర్జీవీ సంచలన కామెంట్స్
== నవదంపతులను ఆశీర్వదించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
నూతన దంపతులను ఎంఎల్సీ తాత మధు, ఎంపి నామా నాగేశ్వర రావు, ఎంఎల్ఏ లు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, బోల్లం మల్లయ్య యాదవ్, శంకర్ నాయక్, డోర్నకల్ బిషప్ (సీఎస్ఐ) పద్మారావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, మాజి ఎంఎల్ సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, జిల్లా పరిషత్ చైర్మన్ లు లింగాల కమల్ రాజ్, కొరం కనకయ్య, జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్ లు స్నేహలత, మధు సుధన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మాజి ఎమ్మెల్యే చంద్రావతి, సుడా చైర్మన్ విజయ్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సీపీఐజిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, పోలీస్ అధికారులు, టీఎన్జీవోస్, టీజీవోస్, వైద్యులు, మమత వైద్య విద్యా సంస్థల సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి: ‘గాడ్‌ఫాదర్’మ్యూజిక్ పై నెటిజన్ల ఫైర్