Telugu News

ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కదిలిన పువ్వాడ..

అనేక సమస్యలు తక్షణ పరిష్కారం..

0

ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కదిలిన పువ్వాడ..

== అనేక సమస్యలు తక్షణ పరిష్కారం..

== సుదీర్ఘ సమస్యలు సైతం తక్షణ పరిష్కారం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రజా సమస్యల తక్షణ పరిష్కరిష్కారమే వాడ వాడ పువ్వాడ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం 50వ డివిజన్ నందు మంత్రి ఉదయం 6.00 గంటలకే అధికారులతో కలిసి వీధుల్లోని సైడ్ డ్రైన్స్, రోడ్లు, ఇంటి పరిసరాలను ఇంటింటికి తిరిగి సమస్యలను స్వయంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలను కలిసి వారి క్షేమ సమాచారం తెలుసుకుని డివిజన్లలో ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

allso read- ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

మిషన్ భగీరథ నీరు, డ్రైనేజ్, సమస్యలను ప్రధానంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే త్రాగునీరు, డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రతి డివిజన్లో విశాలమైన రోడ్లు, సైడ్ డ్రైన్స్, పార్కులు, సెంట్రల్ టైటింగ్ను ఏర్పాటు చేసుకోని నగరాన్ని సుందర నగరంగా అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయా అని నేరుగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ సమస్యలు సైతం తక్షణ పరిష్కారం అవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజితక్కుమార్, కార్పోరేటర్ రాపర్తి శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

allso read- ఖమ్మం కాంగ్రెస్ కు షాకిచ్చిన కార్పోరేటర్