గోల్డ్ మెడల్ సాధించిన తెలుగుమ్మాయి
== కామెన్ వెల్త్ గెమ్స్ లో స్వర్ణం సాధించిన పీవీ.సిందు
== వరసగా మూడవ సారి పతకం సాధించిన తెలుగుషెట్లర్
హైదరాబాద్, ఆగస్టు 8(విజయంన్యూస్)
అచ్చతెలుగమ్మాయి బంగారు పతకం సాధించింది.. అందులో ఇందులో కాదు.. కామెన్ వెల్త్ గేమ్స్ లో జరిగిన బ్యాటమెంటన్ టోర్నమెంట్ లో పీ.వీ.సిందు బంగారు పతకం సాధించింది. సోమవారం జరిగిన ఉమెన్స్ సింగిల్ బ్యాట్మెంటన్ టోర్ని పైనల్ మ్యాచ్ లో కెనడాకు చెందిన మీషర్లలీ పై 21-15, 21-13 వరస షెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో కామెన్ వెల్త్ టోర్నమెంట్ లో పీవీ.సింధు వరసగా మూడవ సారి పథకం సాధించింది. 2014లో కాంస్యం సాధించిన ఆమె, 2018లో చిన్న మిస్టెక్ తో గోల్డ్ మెడల్ మిస్ అయ్యి రజత పథకం సాధించింది. ప్రస్తుతం 2022లో జరిగిన కామెన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించింది. దీంతో కామెన్ వెల్త్ గేమ్స్ లో పతకాల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రితో పాటు హోమంత్రి, ముఖ్యమంత్రులు, క్రీడాకారులు సింధును అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి : అందర్ని కలిసి మాట్లాడతా: భట్టి