Telugu News

నాణ్యత తేమశాతం పరిశీలించి ధాన్యం కొనుగోలు చేయాలి 

జిల్లా కలెక్టర్ శశాంక

0

నాణ్యత తేమశాతం పరిశీలించి ధాన్యం కొనుగోలు చేయాలి 

జిల్లా కలెక్టర్ శశాంక

(మహబూబాబాద్ విజయం న్యూస్)

కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమ శాతం, నాణ్యతను పరిశీలిస్తూ కొనుగోళ్ళు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తగూడ పర్యటించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో వున్న ధాన్యాన్ని పరిశీలించారు. తూర్పారబట్టిన, క్లీనింగ్ చేసిన ధాన్యానికి ఎంత మేరకు రశిదును రైతుకు ఇస్తామో అంత మొత్తానికి తగ్గకుండా డబ్బులు వారు పొందాలని తెలిపారు. మిల్లర్లు ఇబ్బందులు కల్పించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన యంత్రాలను సమకూర్చుకోవాలని, 3 వేల మెట్రిక్ టన్నులు దాటితే వేయింగ్ మిషన్ ని అదనంగా ఎర్పాటు చేసుకోవాలని సూచించారు.

నాణ్యత, తేమ శాతం పరిశీలించి ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ ఉంచకుండా, తడవకుండా అదే రోజు తరలించాలని, కొనుగోలు కేంద్రంలో టార్పలిన లు, గన్ని బ్యాగ్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

టోకెన్లు జారీ చేసి కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కొనుగోలు విధానాన్ని అధికారులు పూర్తిగా పర్యవేక్షిస్తూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిటిడివో దిలీప్ కుమార్, ఒడిసి ఎమ్మెస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్

ఎంపిడిఓ కరణ్ సింగ్, ఎంపీటీసీ హలవత్ సాలుకి సురేష్, డి.సి. ఒ.ఖుర్షీద్, వ్యవసాయ అధికారులు ఉదయ్, రాజు, సెంటర్ ఇంచార్జీ మొగిలి, తదితరులు పాల్గొన్నారు.

also read :- జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం.