కలహించుకుంటారా…?కలిసి నడుస్తారా…?
*నూకల దారెటు
*రసవత్తరంగా కురవి మండల రాజకీయ సమీకరణాలు
*రాజకీయ చట్రంలో ఎవరి దారెటు..?
(మహబూబాబాద్ విజయం న్యూస్);-
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలంలో మొగిలిచర్ల గ్రామం రాజకీయంగా మంచి సుడి ఉన్న గ్రామం..!! ఈ..గ్రామం చిన్నదే అయినా.. ఉన్నంతలో పెద్ద పదువులు ఎక్కువగా దక్కిన గ్రామం మొగిలిచర్ల..మండల వ్యవస్థ వచ్చినాక ఇప్పటివరకు ఆరుగురు యంపిపిలు అయితే ముగ్గురు ఈ..గ్రామానికి చెందినవారే వరుసగా పదువులు అలంకరించారు. ఆరవసారి కూడా అందినట్లే అంది యంపిపి పీఠం జారిపోయింది లేదంటే ఈసారి కూడా మొగిలిచర్లకే అదృష్టం దక్కేది.. జెడ్పీటీసీ, ఓడిసియంయస్ చైర్మన్, మండలపార్టీ అద్యక్షులు, సొసైటీ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, ఆత్మచైర్మన్, ఆలయచైర్మన్ ఇలా.. ఎన్నో..ఎన్నో.. ఊరికి మించిన పదవులు మొగిలిచర్లకు వచ్చాయి..డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ..ఊరి నాయకులను ఊరికే మాత్రం ఉండనివ్వడు.. ఏదో కుర్చీలో కూర్చోపెట్టెస్తాడనే.. నానుడి ఉంది.. అలాంటి మొగిలిచర్ల గ్రామం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది…
also read :-ప్రజలకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఏదో ఊహించుకొని వెల్తే.. ఏమి జరగడం లేదన్న ఆందోళన..!మంత్రి శిబిరం నుండి… మళ్ళీ.. ఎమ్మెల్యే శిబిరం లోకి ప్రయాణం..! సన్నిహితుల సహాయంతో రెడ్యాను చల్లబరిచే యత్నాలు..ఓ..రియల్టర్ సహాయంతోనూ మంతనాలు.. అందులో బాగంగానే మొగిలిచర్లలో రైతుసంబురాలు..నూకల చేరిక పట్ల విముఖత చూపుతున్న మండలకమిటి.., మొగిలిచర్ల స్థానిక నాయకులు..?మాజీ ఓడిసియంయస్ చైర్మన్ నూకల.వేణుగోపాల్ రెడ్డి అంశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏం..నిర్ణయం తీసుకోనున్నారు.. వచ్చేందుకు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు గేట్లు తెరుస్తారా..! ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది కదా.. అని మరికొంత కాలం దూరంగానే ఉంచుతారా..? డోర్నకల్ నియోజకవర్గంలో తనను కాదని ఎంతటి నాయకుడు వదిలి వెళ్ళినా.. మళ్ళీ కొంతకాలానికి ఉగ్గంపల్లి వచ్చి తప్పు ఒప్పుకొని తన గుంపులో కలిసి పోవాల్సిందే అనే సందేశాన్ని నూకల ఎపిసోడ్ తో రెడ్యా ఇవ్వనున్నారా..?!!
also read :-రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నిర్ధాక్షణ్యంగా పార్టీ మండల అద్యక్ష పదవినుండి తొలిగించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్.. వేణుగోపాల్ రెడ్డికి మళ్ళీ అంతటి ప్రాధాన్యత ఇస్తారా..? ఇంతా..జరుగుతున్నా.. మంత్రి సత్యవతిరాథోడ్ మాత్రం నూకల పోతే పోని అనుకుంటున్నారు తప్పా.. ఈ..పరిణామాల పట్ల.. కనీసం స్పందించడంలేదు.. ఏమాత్రం ఆసక్తికూడా ఎందుకు చూపడం లేదు..?అప్పుడు ఏదో అలా జరిగింది.. ఇప్పుడు ఎమ్మెల్యే వెంట నడిచేందుకు నిర్ణయం తీసుకున్న అంటున్న నూకల ఆలోచన ఏమిటి..? ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గంలో ఇదే చర్చ..!! పై..ప్రశ్నలన్నింటికి సమాదానం తేలాలంటే..కొంత సమయం వేచిచూడాలి..!! లేదంటే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పెదవి విప్పాలి..