Telugu News

బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

23న ఇల్లెందులో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం

0

బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

== పొంగులేటి గూటిలో చేరిన జడ్పీచైర్మన్..?

== బహిరంగ సభకు గైరాజరు

== ఆయన బాటలోనే మరికొంత మంది ప్రజాప్రతినిధులు

== 23న ఇల్లెందులో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం

== హాజరవుతున్న కోరం, మడత, ప్రజాప్రతినిధులు..?

== 10వేల మందితో సమ్మెళనంకు ఏర్పాట్లు పూర్తి

ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీచైర్మన్ కోరం కనకయ్య పార్టీని వీడుతున్నారా..? బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..? ఆయనతో పాటు ఆయన వర్గీయులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారా..? వారంతా పొంగులేటి బాటలో పయనించేందుకు సిద్దమైయ్యారా..? అంటే నిజమేనని అంటున్నారు ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోరం కనకయ్య.. దాదాపుగా ఆ పార్టీని వీడినట్లేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆయన వర్గీయులు, ప్రజాప్రతినిధులు కూడా ఆయన బాటలో పయనించే అవకాశం ఉంది.. అందులో భాగంగానే ఈనెల 23న ఇల్లందులో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ నడుమ ఈ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేశారు. కోరం కనకయ్య పార్టీ మారుతున్నారా..? ఆయన రాబోయే రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్తున్నారనే విషయంపై ‘విజయం ప్రతినిధి’ అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం  

(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయం న్యూస్)

ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాలకు పెట్టింది పేరు.. అనేక ఉద్యమాలకు వేదికగా మారింది.. తెలంగాణ ఉద్యమం ఇక్కడినుంచి పురుడు పోసుకుంది.. తొలిదశ, మలిదశ ఉద్యమానికి నాంధి అయ్యింది ఇల్లెందు నియోజకవర్గం. సింగరేణి, కార్మిక ఉద్యమాలకు పేరుగాంచింది. 1957లో నియోజకవర్గంగా ఏర్పడి ఎస్టీ రిజర్వేషన్ గా మారింది. ఆ తరువాత 1962లో జనరల్ గామారింది. ఆ తరువాత 1978లో ఎస్టీ రిజర్వేషన్ గా మారి, నేటి వరకు అలాగే కొనసాగుతుంది. అయితే మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 5 సార్లు కాంగ్రెస్, ఒక సారి టీడీపీ, 6 సార్లు న్యూడెమోక్రసీ, 2 సార్లు సీపీఐ పార్టీ గెలిచింది. అలాంటి ఇల్లెందు నేడు రాజకీయ పెనుమార్పులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇల్లెందు నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.

ఇది కూడ చదవండి: ఖమ్మం రూరల్ లో  మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గం కమ్యూనిస్టులకు అడ్డాగా ఉంది. అనేక దఫాలుగా కమ్యూనిస్టులు పాలించిన నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో 25 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ జెండాను ఇల్లెందు నియోజకవర్గంపై ఎగరవేసిన నాయకుడు కోరం కనకయ్య. ఆ తరువాత ఆయన అధికార పార్టీకి పోవడం తిరిగి హరిప్రియనాయక్ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. ప్రస్తుతం కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఓటమి చెందినప్పటికి, తిరిగి జడ్పీచైర్మన్ గా ఎన్నికైయ్యారు.

== 20 ఏళ్ల తరువాత ఇల్లెందుపై ఎగిరిన కాంగ్రెస్ జెండా

మాజీ ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన కోరం కనకయ్య ఆ తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాయంలో టీఆర్ఎస్ గూటికి వెళ్లిపోయిన కోరం కనకయ్య 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావుతో ఉండగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జడ్పీచైర్మన్ గా ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయనకు టిక్కెట్ వచ్చే అవకాశాలు లేవు.

ఇది కూడా చదవండి: ఒంటరైన సండ్ర..అవుతున్నాడా..? చేస్తున్నారా.?

దీంతో ఇటీవలే గత రెండేళ్ల నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుడిగా, ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. అయితే జనబలం ఉన్న కోరం కనకయ్య అర్థిక పరిస్థితి మాత్రం అంతంతంగానే ఉంది. ఈ క్రమంలో పొంగులేటి కరెక్ట్ అని భావించిన కోరం కనకయ్య ఆయనతోనే ఉండిపోతున్నారు.

== బీఆర్ఎస్ కు కోరం దూరం.

సీఎం కేసీఆర్ చేపట్టిన అత్యంత కీలక బహిరంగ సభకు అధికార పార్టీలో పదవులను అనుభవిస్తున్న వారు కూడా ఈ సభకు దూరంగా ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బహిరంగ సభకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన బహిరంగ సభ సమయంలో హైదరాబాద్ లో ఉన్పప్పటికి  ఆయన వర్గీయులు కూడా బహిరంగ సభకు వెళ్లలేదు.

ఇది కూడా చదవండి: పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి

కనీసం పంపించే ప్రయత్నం కూడా జరగలేదు. అలాగే బహిరంగ సభ ఇంచార్జ్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు  ఇల్లెందులో పర్యటించిన, అక్కడ బహిరంగ సభకు సన్నాహక సమావేశం నిర్వహించిన ఆ సమావేశాలకు కూడా జడ్పీచైర్మన్ కనిపించలేదు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో జరిగిన సన్నాహక సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. దీంతో కోరం కనకయ్య దాదాపుగా గోడ దూకినట్లే అన్నట్లుగా చర్జ జరుగుతోంది. ముఖ్యంగా  మొదటి నుంచే కోరం కనకయ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండగా, పొంగులేటితో బయటకు వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే కోరం కనకయ్యను నిలువరించేందుకు, బుజ్జగించేందుకు ఖమ్మం జిల్లాలోని కీలక నాయకులు, ఇంచార్జ్ గా వచ్చిన డబుల్ షూటర్ హరీష్ రావు కూడా కోరం కనకయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఫలితం దక్కలేదు. కోరం కనకయ్య ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

== శీనన్న వైపు ముగ్గు?

మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వైపే కోరం కనకయ్య మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇల్లెందు నియోజక వర్గం నుంచి బరిలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా  స్పష్టం అవుతుంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో కోరం ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులను వదిలిపెట్టకుండా కాపాడుకుంటూ వచ్చారు. గత మూడేళ్ల నుండి నియోజకవర్గ నలుమూలల పర్యటిస్తూ శ్రీనివాస్ రెడ్డి ద్వారా పలు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. ఈ సామాజిక ఆర్థిక సహాయాలు కోరం కనకయ్యకు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

== రేపు ఆత్మీయ సమ్మేళనం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోకవర్గాల్లో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సమ్మెళనాలను ఏర్పాటు చేయగా, సోమవారం ఇల్లెందు పట్టణంలో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇల్లందులో కింగ్ మేకర్ ‘మడత’

ఓ మామిడితోటలో ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆ కార్యక్రమాన్ని కోరం కనకయ్య దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 10వేల నుంచి 15వేల మందితో ఈ ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పటీసీలు హాజరైయ్యేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లుగా కోరం కనకయ్య ఆ పార్టీ నాయకులకు చెప్పకనే చెప్పినట్లుగా భావించాల్సి ఉంది. అయితే కోరం కనకయ్య ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం సస్పెన్షనే.. ఎందుకంటే ముందుగా బీజేపీ పార్టీలోకి వెళ్లాలని భావించిన పొంగులేటి ఆ తరువాత కొంత బ్యాక్ అయ్యారనేది తెలుస్తోంది. ఈనెల 18న అమిత్ షాతో బేటి అని ప్రచారం జరిగినప్పటికి కొంత మంది నియోజకవర్గ ఇన్ చార్జ్ లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పొంగులేటి అందర్ని కలుపుకుని, ఏక నిర్ణయంతో పార్టీ మారలని భావించి ఇతర పార్టీలో చేరిక అంశాన్ని కొంత ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దాదాపు గుడ్ బై చెప్పినట్లేగా భావించాల్సి ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..?