Telugu News

నడిరోడ్డుపై వెలిసిన ఎండిన మొక్క

-- ఆర్అండ్ బీ అధికారుల పనితీరుకు ఇదే నిదర్శనం

0

నడిరోడ్డుపై వెలిసిన ఎండిన మొక్క

— ఆర్అండ్ బీ అధికారుల పనితీరుకు ఇదే నిదర్శనం

(ఖమ్మం రూరల్ -విజయం న్యూస్)

నడిరోడ్డుపై మొక్క వెలిసిందా..?.. ఇదేంటని అనుకుంటున్నారా..? నిజమేనండి.. ఖమ్మం-హైదరాబాద్ ప్రధాన రహదారి.. నిత్యం వేలాధి వాహనాలు రాకపోకలు చేసే రోడ్డు.. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్డు ద్వారా ప్రయాణించే పరిస్థితి .. ఖమ్మం పట్టణానికి అతికొద్ది దగ్గర్లోనే  ప్రధాన రహదారిపై ఈ చెట్టు వెలిసింది..! రోడ్డుపై చెట్టు వెలవడం ఏంటనీ విచిత్రంగా అనుకుంటున్నారా..? అదేంనండీ.. ఆర్అండ్ బీ అధికారుల పనితీరుకు నిదర్శనమే ఇది. ఖమ్మం రూరల్ మండలం, పెద్దతండా సమీపంలోని ఖమ్మం -హైదరాబాద్ ప్రధాన రహదారిపై నడిసెంటర్లో  ఇటీవలే  పెద్ద గుంత పడింది. నిత్యం వాహనాలు రాకపోకలు చేస్తుండటం, దగ్గరకు వచ్చే వరకు ఆ గుంత కనిపించకపోవడంతో స్థానికులు ఆ గుంతలో పెద్ద ఎండిపోయిన మొక్కను అందులో పెట్టి రాళ్లు అడ్డుగా పెట్టారు. పెద్ద గుంత పడి రోజులు గడుస్తున్న సంబంధిత ఆర్అండ్ బీ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధకారం. దీంతో స్థానికులు, ప్రయాణికులు నడిరోడ్డుపై వెలిసిన చెట్టువైపు విచిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. ఆ పోటోను విజయం పత్రిక  విలేకరి క్లిక్ మనిపించాడు.

also raed : పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం