Telugu News

వనమా కుటుంబంపై జనాగ్రహం

* నిరసనలతో హోరెత్తిన కొత్తగూడెం

0

వనమా కుటుంబంపై జనాగ్రహం
** నిరసనలతో హోరెత్తిన కొత్తగూడెం
** రాష్ట్రంలో సంచలనం రేపిన రాఘవ వ్యవహారం…
** నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాఘవ అరెస్ట్..?
** బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేనా ..?
** వనమా రాఘవేంద్ర పై వేటు పడినే..?
** ప్రశ్నార్థకంగా మారిన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా రాజకీయ భవిష్యత్తు…. ?

(భద్రాద్రికొత్తగూడెం-విజయం న్యూస్);-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు వ్యవహారం పై కొత్తగూడెం పట్టణంలో గురువారం జనాగ్రహం నెలకొంది. మానవ మృగం రాఘవ పై తక్షణమే టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టి పార్టీ నుండి బహిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విపక్షాల తో పాటు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు రాష్ట్రంలో పెను సంచలనాలకు తెరలేపాయి. దీంతో కొత్తగూడెం నియోజక వర్గం తోపాటు రాష్ట్రంలో రాజకీయ దూమరనికి తెరలేపింది. వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు ను తక్షణమే అరెస్ట్ చేసి తండ్రి తనయులపై టిఆర్ఎస్ పార్టీ తక్షణమే వేటు వేసి పార్టీ నుండి బహిష్కరించాలనే డిమాండ్ తో కొనసాగిన ధర్నాలు నిరసన కార్యక్రమాలకు పెద్ధఎత్తున జనమోధం లభించింది. దీంతో జన గ్రహానికి తలవంచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రామకష్ణ కుటుంబం ఆత్మహత్యపై స్పందించారు. వనమా వెంకటేశ్వరరావు మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు.

also read :-దేశానికి రైతు వెన్నుముక.: అంకిరెడ్డి.

రాఘవ అరెస్టుకు సహాకరిస్తానని, రామకష్ణ కుటుంబం ఆత్మహత్య బాధకల్గించిందన్నారు. పోలీసులకు తప్పకుండా సహాకరిస్తామని, పార్టీ క్రమశిక్షణ చర్యల అంశంలోపై రాష్ట్ర పార్టీ ఆదేశాలను పాటిస్తానని తెలిపారు. దీంతో ఆయన లేఖ విడుదల చేసిన గంట లోపే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైద్రాబాద్ లో తనపై వచ్చిన ఆరోపణలపై మీడియాకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితమే అతనపై ఇండియన్ పిన్ లు కోడ్ ఐపిసి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పాల్వంచ ఏ ఎస్పీ. రోహిత్ రాజు మీడియాకు వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు పోలీసులు న్యాయం చేసేలా ఉపక్రమించి రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధికార వ్యామోహంతో మహిళపై కన్నేసిన మానవ మృగం రాఘవ పై తక్షణమే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు కోరుతున్నారు.

also read :-తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

అధికారం పదవి వ్యామోహంతో ఎమ్మెల్యే తనయునిగా అధికార పార్టీ అండతో నియోజకవర్గంలోని మహిళా పై కన్నేసిన రాఘవ, రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కొత్తగూడెం మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావులతోపాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కుల సంఘాల నాయకులు ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోనే పెను సంచలనాలకు తెర లేపిన శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు పై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించక పోవడం ఏమిటని మహిళా సంఘాల నాయకులు ప్రశ్నింస్తున్నారు. గతంలో కూడా పలు సంఘటనల్లో ఆరోణలను ఎదుర్కున్న రాఘవ వ్యవహారం పై పార్టీ అధిష్టానం పేదవి విరవకపోవడం ఏమిటనే ప్రశ్న నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది.ఎమ్మెల్యే తనయుని వికృత చర్యలతో సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి వనమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందనే చెప్పాలి.. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం మేల్కొని రాఘవా రాసలీలకు అడ్డుకట్టవేసి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం జరిగిన జరిగిన సంఘటనపై పూర్తి స్తాయి విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనిదోషులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నానానరు.