Telugu News

అభివృద్ధి లో రోల్ మోడల్ గా రఘునాధపాలెం:మంత్రి

= రూ.1.92కోట్లతో చేపట్టిన  అభివృద్ది పనులను  ప్రారంభించిన మంత్రి పువ్వాడ 

0

అభివృద్ధి లో రోల్ మోడల్ గా రఘునాధపాలెం:మంత్రి

== రూ.1.92కోట్లతో చేపట్టిన  అభివృద్ది పనులను  ప్రారంభించిన మంత్రి పువ్వాడ 

ఖమ్మం అక్టోబర్ 3(విజయం న్యూస్):
అభివృద్ధి పనుల్లో రఘునాథపాలెం మండలం మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం  రఘునాథపాలెం మండలంలో రూ.1.92కోట్లతో చేపట్టిన  అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో NREGS, SDF, SUDA నిధులు
బావోజీ తండా గ్రామంలో రూ.39.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.

ఇది కూడా చదవండి:-;మున్నేరు రివర్ ఫ్రంట్ గా నామకరణం:మంత్రి

రాముల తండా గ్రామంలో రూ.35.69 లక్షలతో హైమస్ట్ లైట్స్, గ్రామంలో నిర్మించిన 5-సీసీ రోడ్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
గడ్డికుంట తండా, మల్లేపల్లి గ్రామంలో రూ.11.50 లక్షలతో చేపట్టిన 2-అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
పరికలబోడు తండా గ్రామంలో రూ.31.50 లక్షలతో చేపట్టిన    7 అభివృద్ధి పనులు, హై మాస్ట్ లైట్స్ ను మంత్రి ప్రారంభించారు.
జింకల తండా గ్రామంలో రూ.54.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్స్, డ్రెయిన్స్ ఇతర అభివృద్ది పనులు, హై మాస్ట్ లైట్స్ ను  ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:-;సంక్షేమంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్:మంత్రి
రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన జింకల తండా గ్రామ పంచాయితీ కార్యాలయం ను మంత్రి  ప్రారంభించారు.
కార్యక్రమం లో డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్ పి టీ సి ప్రియాంక, ఎం.పి.పి.గౌరీ, తహసీల్దార్ విల్సన్, ఎం పి.డి ఓ.రామకృష్ణ, ఇ ఇ పి.అర్. కె వి.కె.శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు