Telugu News

ఖమ్మం ఏసీపీ పరిధిలోకి రఘునాథపాలం పోలీస్ స్టేషన్

 హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు.. కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.

0

ఖమ్మం ఏసీపీ పరిధిలోకి రఘునాథపాలం పోలీస్ స్టేషన్

== ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ

== హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు.. కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను ఏసీపీ రూరల్ పరిధి నుంచి  ఖమ్మం టౌన్ ఏసీపీ పరిధిలోనికి మార్పు చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రజల భద్రత, పరిపాలనా సౌలభ్యం, ఇతర సేవల దృష్ట్యా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ  విషయమై ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను ఖమ్మం  ఏసీపీ పరిధిలోకి తీసుకురావడం పట్ల మంత్రి పువ్వాడ కు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తన విజ్ఞప్తి మన్నించి రూరల్ ఏసీపీ పరిది నుండి ఖమ్మం ఏసీపీ పరిధిలోకి మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి, హోం శాఖ మంత్రి మహామూద్ అలీకి, మంత్రి కేటిఆర్ కి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’