Telugu News

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి..?

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు

0

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి..?

== నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు

== రెండు సెట్ల నామినేషన్లు దాఖలు 

== అభ్యర్థి విషయంలో అధికారికంగా రానీ ప్రకటన

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రఘురాం రెడ్డి తరుపునా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ సుదీర్ఘ చర్చలు అనంతరం కొలిక్కి వచ్చిన ఖమ్మం పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక రెండు పేర్లను రాహుల్ గాంధీకి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు కానీ రఘురాం రెడ్డి తరుపునా కొందరు కాంగ్రెస్ నాయకులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి తరుపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల నరేష్ రెడ్డి ,మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్,డాక్టర్ కోట రాంబాబు, రామ్మూర్తి నాయక్, జొన్నల గడ్డ రవి,ఎండి. ముస్తఫా, మలీదు జగన్, రమేష్ తదితరులు కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు.