Telugu News

సీఎంని  కలిసిన రఘురాం రెడ్డి

భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి 

0

సీఎంని  కలిసిన రఘురాం రెడ్డి

==  అభ్యర్థిగా ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన రామసహాయం కుటుంబం

== భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి 

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ చివరి రోజు ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో  కలిసి తన తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు. పుష్పగుచ్చం అందించి, చాలువ తో ఘనంగా సత్కరించారు. సీటు కేటాయించడానికి సహాకరించిన  ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కచ్చితంగా గెలిచే సీటు కావడంతో మంచి అద్భుతమైన మెజారిటీ తెచ్చుకోవాలని, రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీ రావాలని సూచించారు. టిక్కెట్ వచ్చిన సందర్భంగా అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు.