Telugu News

రఘురాం రెడ్డి *విక్టరీ* జోష్

ఖమ్మంలో సినీ హీరో వెంకటేష్ ప్రచారంతో కొత్త ఉత్సాహం

0

రఘురాం రెడ్డి *విక్టరీ* జోష్

* ఖమ్మంలో సినీ హీరో వెంకటేష్ ప్రచారంతో కొత్త ఉత్సాహం

ఖమ్మం-విజయం న్యూస్):

కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ సినీ హీరో, రఘురాం రెడ్డి వియ్యంకుడు దగ్గుబాటి వెoకటేష్ మంగళవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో తో కొత్త ఉత్సాహం నెలకొంది. అసలే ఆయనను విక్టరీ.. అంటూ కితాబునిస్తూ సినీ పరిశ్రమలో ముద్దుగా పిలుస్తారు.

ఇది కూడా చదవండి:- హలో ఖమ్మం.. జయం మనదే: వెంకటేష్

ఎక్కువగా రాజకీయాలకు దూరంగా ఉండే వెంకీ.. తన వియ్యంకుడి ఘన విజయం కోసం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి స్వయంగా రోడ్ షో చేస్తూ, తనదైన శైలిలో జెమినీ, గణేష్ చిత్రాలప్పటి బహు ప్రాచుర్యం పొందిన డైలాగులు చెబుతూ, సంజ్ఞలు చేస్తూ తన అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులను అలరిస్తూ, ఆకట్టుకుంటూ ముందుకు సాగారు. ఎటు చూసినా అశేష జనవాహిని నడుమ సాగిన ఈ ప్రచారం.. ముందస్తుగానే ఎన్నికల విజయోత్సవాన్ని తలపించింది. అందరిలోనూ నయా జోష్ నింపింది.

ఇది కూడా చదవండి:- మూడో నెంబర్ “గుర్తుం”దా…!: విక్టరీ వెంకటేష్