Telugu News

రేణుక నివాసినికి వెళ్ళిన రఘురాం రెడ్డి

నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తున్న రఘురాంరెడ్డి 

0

రేణుక నివాసినికి వెళ్ళిన రఘురాం రెడ్డి

== నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తున్న రఘురాంరెడ్డి 

==  కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
== రేణుక చౌదరి తో ఆత్మీయ భేటీ, పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సమ్మేళనం

(ఖమ్మం-విజయం న్యూస్):

కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి బుధవారం నగరంలో విస్తృత ప్రచారం చేశారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసానికి వెళ్లి.. మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచార సరళి పై చర్చించారు.
విశ్రాంత ఉద్యోగి ఇంట అల్పాహారం..రాధాకృష్ణ నగర్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాందాస్ కృష్ణమూర్తి నివాసానికి రఘురాం రెడ్డి వెళ్లి.. ఆప్యాయంగా పలకరించారు. ఉదయం వారి ఇంట అల్పాహారం స్వీకరించారు.

ఇది కూడా చదవండి:- రైతుల కోసం పనిచేస్తా: రఘురాంరెడ్డి 
*పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో..* ఖమ్మం పౌర సమితి ఆత్మీయ సమ్మేళనానికి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరై.. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో కలిసి ప్రసంగించారు. సంఘం కార్యకలాపాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*ఈ కార్యక్రమాల్లో..* మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎర్నేని రామారావు, పౌరసమితి ఆహ్వాన సంఘం బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- రఘురాం రెడ్డి *విక్టరీ* జోష్