Telugu News

తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం

సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఓట్ల అభ్యర్థన

0

తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం

– పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు
– సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఓట్ల అభ్యర్థన

(తల్లాడ-విజయం న్యూస్):

కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం తల్లాడ మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చెన్నూరు, కలకోడిమ, కుర్నవల్లి, పాత పినపాక, తల్లాడ, మల్లారం గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, విద్య, మౌలిక వసతుల సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు తో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- రైతుల కోసం పనిచేస్తా: రఘురాంరెడ్డి 

ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీఆర్ ఎస్, బీజేపీ లు జన సంక్షేమాన్ని మరిచాయని విమర్శించారు. పదేళ్ళు పాలించినప్పటికీ ఏమీ చేయలేదని అన్నారు. వాళ్లు దోచుకోవడమే సరిపోయిందని, కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పుల భారం వేసి పోయాడని అన్నారు. బీజేపీ రాములోరి పేరిట రాజకీయాలు చేస్తోందని, మత విద్వేషాలు రెచ్చకొడుతోందని అన్నారు. ప్రజా సేవ చేయడం కోసం పోటీ చేస్తున్నానని, ఒక అవకాశం ఇచ్చి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
== నాకంటే ఎక్కువ మెజారిటీ అందించాలి..: ఎమ్మెల్యే రాగమయి*
అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాను పోటీ చేయగా.. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి, మంచి విజయాన్ని అందించారని.. అంతకు మించిన మెజారిటీని ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పిలుపునిచ్చారు. కొద్దికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేసిందని, ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటించి రఘురాం రెడ్డి భారీ విజయానికి కృషి చేయాలని కోరారు.
*ఈ కార్యక్రమాల్లో..* సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు పసుమర్తి చందర్ రావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పసుమర్తి మోహన్ రావు, మాచర్ల భారతి, మాదాల వెంకటేశ్వర్, శ్రీ రామ్ సుమంత్, రామారావు, నారపురెడ్డి, పెద్ద బోయిన శ్రీనివాస్, కృష్ణారెడ్డి, చంపసాల వెంకట్, ఏనుగు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.