Telugu News

ఖమ్మంలో సర్కార్ కార్యాలయాలకు మోక్షం

పోలీస్, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి

0

ఖమ్మంలో సర్కార్ కార్యాలయాలకు మోక్షం

== పోలీస్, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి

== ఈనెల 10న ముహుర్తం

ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 7(విజయంన్యూస్)

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో సర్కార్ కార్యాలయాలకు మోక్షం లభించింది. కొత్తగా ఏర్పడిన రఘునాథపాలెం మండలానికి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలు స్వంత భవనాలు లేకపోవడంతో స్పందించిన  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో రఘునాథపాలెం మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించగా, ఇటీవలే స్థల పరిశీలన పూర్తైయ్యింది. దీంతో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

allso read- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల

== స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ నేతలు

రఘునాథపాలెం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులకు  ఈ నెల 10వ తేదీన ఉదయం 10.00గంటలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పీఏ రవి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా స్థలాన్ని మంత్రి పీఏ రవికిరణ్, పార్టీ నాయకులు శుక్రవారం  పరిశీలించి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. రఘునాథపాలెం మండలం ఎర్పాటు అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో మండల స్వరూపం ఒక్కొకటిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మండల కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఉండాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మేల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండల కేంద్రంలో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేశారని వివరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్దనే ప్రధాన రహదారి పక్కనే రెండూ ఎకరాల సువిశాల స్థలంలో పోలీస్ స్టేషన్, మరో రెండెకరాల స్థలంలో తహశీల్దార్ కార్యాలయంకు మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీన మంత్రి పువ్వాడ కుమార్ ఆయా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి త్వరలో ప్రజలకు సేవలు అందిస్తారని అన్నారు.

allso read-సీఎం కేసీఆర్ పీఎం కావడం ఖాయం : మంత్రి పువ్వాడ

త్వరలో అక్కడే మరో రెండెకరాల స్థలంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) కార్యాలయాన్ని సైతం స్థలాన్ని కేటాయించనున్నారని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోటకు రావడం పట్ల మండల ప్రజలు, రైతులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నర్సింహరావు, సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, పీఆర్ఏఈ ఆదిత్య రాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మండల అధ్యక్షుడు అజ్మీరా వీరు నాయక్, పిన్ని కోటేశ్వర రావు, మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్ రావు, మద్దినేని వెంకటరమణ, గుడిపుడి రామారావు, మందడపు సుధాకర్, మందడపు మాధవ రావు తదితరులు అన్నారు.