Telugu News

రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ పురుగులమందు తాగిని సుధాకర్ అనే వ్యక్తి

0

రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

== తప్పుడు కేసు బనాయించారని పురుగులమందు తాగిని సుధాకర్ అనే వ్యక్తి

== ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం రఘనాథపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యహత్నానికి పాల్పడ్డాడు.. ఓ వివాదం విషయంలో ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకుండా తిరిగి నాపై తప్పుడు కేసు నమోదు చేసి వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయుకు తరలించారు. బాధితుడు తరుపున బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

allso read- సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ

రఘునాథపాలెం మండలంలో ఈర్లపూడి గ్రామానికి చెందిన వినుకొండ సుధాకర్ కు ఆగస్టు 28న మరో ముగ్గురుతో భూ విషయంలో గొడవ జరిగింది. దీంతో సుధాకర్ తలకు గాయాలైయ్యాయి.అటు వైపు ఓ మహిళలకు కూడా గాయాలైనట్లు సమాచారం. కాగా ఇరువురు రఘునాథపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు సుధాకర్ కు తెలిపారు. కాగా ఇన్ని రోజుల తరువాత బుధవారం సుధాకర్ కు రఘునాథపాలెం నుంచి పోలీసులు పోన్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పగా గురువారం రఘునాథపాలెం పీఎస్ కు వచ్చాడు. సుధాకర్ పోలీసులను కలవగా కేసు నమోదైందని చెప్పి లోపల కుర్చోబెట్టడంతో అవమానంగా భావించిన వినుకొండ సుధాకర్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బందువులు తెలిపారు. పోలీసుల వేధింపులు తాళలేకఆత్మహత్య యత్నం చేశాడంటున్న బంధువులు ఆరోపిస్తున్నారు. కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోకపోగా తమ ను వేధిస్తున్నారాని బంధువుల ఆరోపిస్తున్నారు. కాగా వెంటనే   సుధాకర్ ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలను పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయుకు తరలించిన వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

allso read- తక్షణ సాయం నా నైజం… పొంగులేటి