ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ
క్యాబినెట్ ప్రమాణస్వీకారం రోజునే 6స్కీమ్ లు అమలు చేస్తాం
ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ
== క్యాబినెట్ ప్రమాణస్వీకారం రోజునే 6స్కీమ్ లు అమలు చేస్తాం
== కాంగ్రెస్ మాట ఇస్తే తప్పుకునే ప్రసక్తే లేదు
== తుక్కగూడ విజయభేరి సభలో రాహుల్ గాంధీ
(హైదరాబాద్ –విజయంన్యూస్)
తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి శుభవార్త చెప్పంది.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు స్కీమ్ ను అమలు చేస్తామని, అది కూడా కచ్చితంగా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం రోజును అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని తుక్కగూడ లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి శుభవార్త చెబుతున్నామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారంటీ స్కీమ్ లను కచ్చితంగా అమలు చేస్తున్నామని అన్నారు. సోనియా గాంధీ మాట ఇచ్చారంటే తప్పుకునే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసే రోజున ఈ ఆరు పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు.
ఇది కూడా చదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: రాహుల్
కర్నాటకలో మాటిచ్చిన పథకాలను క్యాబినెట్ రోజునే అమలు చేశామని, అవసరమైతే కర్నాటక వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. అక్కడ ప్రజలందరు కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెబుతారని అన్నారు. కర్నాటక తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని హామినిచ్చారు. కర్నాటకలో నరేంద్రమోడీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఎద్దేవా చేశారని, వీళ్లు అమలు చేయలేని పథకాలను చెబుతున్నారని విమర్శించారని, కానీ కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామిలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కర్నాటకలో గ్యారంటీ స్కీమ్ ను క్యాబినెట్ ప్రమాణస్వీకారం రోజునే అమలు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన క్యాబినెట్ ప్రమాణ స్వీకరం రోజునే అమలు చేస్తామని హామినిచ్చారు.
== రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లు ఇవ్వే..
- మొదటి పథకం : తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి పేదవాళ్లకు ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు.
- రెండవ పథకం: తెలంగాణ రావడం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
- మూడవ పథకం : మహాలక్షి పథకాన్ని సోనియా గాంధీ ప్రకటించారని, ప్రతి మహిళలకు నెలకు 2500 ఇవ్వబోతున్నామని తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా తెలంగాణలో మహిలళకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీల ఆత్మ ఒక్కటే: రాహుల్
- నాల్గొవ పథకం : ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.
- ఐదవ పథకం : రూ.5లక్షల యువకులకు కోచింగ్ ఫీజు అంతా కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది తెలిపారు.
- ఆరవ పథకం : నెలకు 4వేల చొప్పన పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కిందా ప్రతి ఒక్క కుటుంబానికి 10లక్షల మంజూరు చేస్తామన్నారు.
- రైతు భరోసా పథకం: రైతు భరోసా పథకం కిందా ఏడాదికి ప్రతి ఎకరానికి రూ.15వేల, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు.