Telugu News

వేదాంత మైనింగ్ ను అడ్డుకున్న సైనికుడు రాహుల్ గాంధీ: భట్టి

మోడీ, నవీన్ పట్నాయక్ కలిసి ఒరిస్సా ప్రజలకు నష్టం చేస్తున్నారు

0

వేదాంత మైనింగ్ ను అడ్డుకున్న సైనికుడు రాహుల్ గాంధీ: భట్టి

== మోడీ, నవీన్ పట్నాయక్ కలిసి ఒరిస్సా ప్రజలకు నష్టం చేస్తున్నారు

== దేశ సంపద ప్రజలకు పంచేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు*

== ఒరిస్సా ప్రజలకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా అండగా నిలిచింది*

== ఒరిస్సా వనరులు స్థానిక ప్రజలకు చెందాలంటే ఇండియా కూటమిని గెలిపించండి*

== బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దువుతాయి*

== రాయబరేలీలో నామినేషన్ ఉండడంతో రాహుల్ రాలేకపోయారు, వారి సందేశాన్ని వినిపించాల్సిందిగా నన్ను ఆదేశించారు

== ఒరిస్సా రాష్ట్రం రాయగడ లోక్ సభ పరిధిలో ఏర్పాటుచేసిన ఎన్నికల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

(ఒరిస్సా -విజయం న్యూస్)
ఒరిస్సా రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధం కాగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి ఓ సైనికుడిలా ఆ తవ్వకాలను అడ్డుకున్నారు. స్థానికులు వేదాంత కార్పొరేట్ కంపెనీతో పోరాటానికి దిగగా రాహుల్ గాంధీ నాయకత్వం వహించి ఆ తవ్వకాలను అడ్డుకున్నారనీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఒరిస్సా వనరులు స్థానిక ప్రజలకే చెందాలన్న ఆయన గట్టిగా పోరాటం మూలంగానే బాక్సైట్ గనులు సురక్షితంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దూర ప్రాంతమైన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మీతో కలిసి భారీ సభలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు అన్నారు.

ఇది కూడా చదవండి:- నేడు కొత్తగూడెంకు ముఖ్యమంత్రి రాక

శుక్రవారం ఒరిస్సా రాష్ట్రం రాయగడ లోక్ సభ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరు కావలసి ఉన్న రాయబరేలిలో నామినేషన్ కార్యక్రమం ఉండడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ప్రధాన వక్తగా స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. అద్వానీ, అమిత్ షా, మోడీ, నవీన్ పట్నాయక్ వైపు ఉండగా మరోవైపు రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారని తెలిపారు. మోడీ దేశ సంపదను అంబానీ, ఆదానీ వంటి కొద్ది మంది తన మిత్రులు, క్రోనీ క్యాపిటల్ స్ కు పంచి పెట్టడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ దేశ సంపద ఈ దేశ వాసులకే జనాభా దామాషా ప్రకారం చెందాలని యువ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ముంబై వరకు ఆయన పాదయాత్ర చేపట్టారని తెలిపారు. కరువు ప్రాంతమైన ఒరిస్సా రాష్ట్రానికి
గాంధీల కుటుంబం ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఇది కూడా చదవండి:- ప్రచారంలో దూసుకుపోతున్న హీరో వెంకటేష్ కూతురు

ఇక్కడ కరువు ఏర్పడినప్పుడు ప్రధాని నెహ్రూ పర్యటించి నిధులు మంజూరు చేశారన్నారు. 1987లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు స్థానికంగా పర్యటించారని గుర్తు చేశారు. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వ రంగ సంస్థలను జాతీయం చేసి పేదలకు అండగా నిలిచారన్నారు. గాంధీల కుటుంబం మాట ఇస్తే తప్పదని ప్రతి మాటను నిలబెట్టుకుంటుందన్నారు. ఆ క్రమంలోనే వేదాంత కంపెనీ తవ్వకాలను జరగనివ్వనని చెప్పిన రాహుల్ గాంధీ అక్షరాల ఆచరణలో చూపించారన్నారు. ఒరిస్సాలో జరుగుతున్న వనరుల దోపిడిని అడ్డుకునేందుకు ఉన్నత విద్యావంతుడు, అమెరికాలో నివసిస్తున్న విఎస్ సప్తగిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయనను గెలిపించాల్సిందిగా డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన సప్తగిరిని గెలిపిస్తే పార్లమెంట్ లో ఆయన మన గొంతుకగా పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఓటు చేతి గుర్తుకు వేయండి, ఇండియా కూటమిని గెలిపించి దేశ సంపదను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే: భట్టి విక్రమార్క..*

బిజెపి అధికారంలోకి వస్తే ఇందిర గాంధీ తెచ్చిన రిజర్వేషన్లు రద్దువుతాయి. ఒరిస్సాలో 70 శాతం జనాభా బీసీ, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. బిజెపి, నవీన్ పట్నాయకులు ఓ కుటుంబంలో కలిసి ఉంటున్నారు. వారి కలయిక దశాబ్దాలుగా ఒరిస్సా ప్రజలకు నష్టం చేకూరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 2000, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరో వెయ్యి రూపాయలు జోడించి 3000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతినెలా 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి క్వింటా ధాన్యానికి మూడు వేల రూపాయలు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి లక్ష రూపాయల సాయం అందించే ప్రణాళిక కాంగ్రెస్ వద్ద ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శ రవేగంగా అమలు చేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, 500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామన్నారు. అత్యధికంగా తెలుగువారు ఉన్న ఈ ప్రాంతంలో సభకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఏఐసీసీ నాయకులు భక్త చరణ్ దాస్, ఆర్ సి కుంతియా, మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.