Telugu News

బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే..?: రాహుల్ గాంధీ

రైతులకు మీరేం చేశారో చెప్పండి

0

బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే..?

== మోడీ పోన్ చేస్తే ఆయన చెప్పిన పని ఆచరణలో పెట్టయడమే కేసీఆర్ లక్ష్యం

== ఎన్నికల ముందే ఢ్రామాలాడతారు

== పార్లమెంట్ లో బీజేపీ పెట్టిన ప్రతిబిల్లును టీఆర్ఎస్ అమోదించింది

==  రైతులకు మీరేం చేశారో చెప్పండి

== రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్

== లక్షల్లో ఉద్యోగాలిచ్చింది కాంగ్రెస్

== దేశంలో ఆస్తులమ్ముకోవడమే బీజేపీ ఇచ్చింది..టీఆర్ఎస్ ఆమోదిస్తుంది

== సమావేశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడిన రాహుల్ గాంధీ

(హైదరాబాద్-విజయంన్యూస్)

బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు దొందుదొందేనని, ఆ రెండు పార్టీలు పక్కా ప్రణాళికతో కలిసి పనిచేస్తారని ఏఐసీసీ మజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక బిల్లులు పెడితే ఆమోదించి చపట్లు కొట్టింది టీఆర్ఎస్ కదా..? అని ప్రశ్నించారు.  ఎన్నికల సమయంలో తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయ‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకుంటూ ప‌ని చేస్తున్నాయ‌ని ఆరోపించారు. నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ కు పోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని, ఆయన చెబితే, ఇతరు చేసి చూపిస్తాడని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర హైదరాబాద్ లోని  పాత‌బ‌స్తీలోని చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు రాహుల్ పాద‌యాత్ర కొన‌సాగింది. ఈ పాద‌యాత్ర‌లో కాంగ్రెస్ నేతలు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :మునుగోడులో ఎమ్మెల్యే ఈటెల కాన్వాయ్ పై దాడి

ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్న‌ర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. బీజేపీని టీఆర్ఎస్ ఎన్నోసార్లు స‌మ‌ర్థించింద‌ని తెలిపారు. ఎన్నో సంద‌ర్భాల్లో టీఆర్ఎస్, బీజేపీ క‌లిసి ప‌ని చేశాయ‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల‌ప్పుడు మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ ఫోన్ చేసిన మ‌రుక్ష‌ణ‌మే మోదీ స్పందిస్తార‌ని పేర్కొన్నారు.

 

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పుడూ కూడా రైతుల‌కు అండ‌గా నిల‌వ‌లేద‌న్నారు. రైతుల‌కు ఈ రెండు పార్టీలు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. దేశంలో యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భించ‌ట్లేద‌న్నారు. ఇంజినీరింగ్ చేసిన వాళ్లు స్విగ్గీలో ప‌ని చేస్తున్నారు.

నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వ‌ల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఎయిర్ పోర్టులు, టెలికాం, ఎల్ఐసీ లాంటి సంస్థ‌ల‌ను మోదీ అమ్మేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు దృష్టి ఎప్పుడూ ధ‌ర‌ణి పోర్ట‌ల్ మీద ఉంటుంది. ఆక్ర‌మించ‌డానికి భూములు ఎక్క‌డ ఉన్నాయో అని కేసీఆర్ చూస్తుంటారు.

ఇది కూడా చదవండి: పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క

అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌త 55 రోజులుగా రాహుల్ పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు. తెలంగాణ‌లో కృష్ణా న‌ది ప‌ర‌వ‌ళ్లు తొక్కిన‌ట్లు.. రాహుల్ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లంతా క‌దం క‌దం క‌లిపారు. చార్మినార్ ప్రాంతంలో దిక్కులు పిక్క‌టిల్లేలా రాహుల్ పాద‌యాత్ర‌కు ల‌క్ష‌లాది మంది జ‌నం క‌దిలి వ‌చ్చార‌ని తెలిపారు.

ఏఐసీసీ అధ్య‌క్షుడి హోదాలో మొద‌టిసారి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు కూడా ఘ‌న స్వాగ‌తం ల‌భించింద‌న్నారు. అత్యంత సామాన్యుడు ప్ర‌జాస్వామ్య‌ యుతంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు అయ్యాడ‌ని ఖ‌ర్గేపై రేవంత్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.