Telugu News

జూన్ 4న కాంగ్రెస్ విజయభేరీ తథ్యం:మద్ది శ్రీనివాస్ రెడ్డి 

రామసహాయం రఘురాం రెడ్డిని  అత్యధిక మెజారిటీతో గెలిపించండి

0

జూన్ 4న రాహుల్ ప్రధాని కావడం ఖాయం:మద్ది శ్రీనివాస్ రెడ్డి 

==  రామసహాయం రఘురాం రెడ్డిని  అత్యధిక మెజారిటీతో గెలిపించండి
== కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
== ఖమ్మం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ / రాష్ట్ర అధికార ప్రతినిధి డా.మద్ది శ్రీనివాస్ రెడ్డి 

(ఖమ్మం-విజయం న్యూస్)

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సంజీవరెడ్డి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్ది మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సూక్ష్మంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పటికీ స్థూలంగా 13 గ్యారంటీలు ఇచ్చిందని, వాటిలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కి పది లక్షలు వర్తింపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ , ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 చొప్పున గృహాలు మంజూరు కార్యక్రమాల అమలు చేసిందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం అంటే, దాదాపు 66 లక్షల మంది రైతులకు 6,319 కోట్ల రూపాయలు రైతు భరోసా సహాయం అందిందని , మిగతా వారికి ఈ నెల 13 తర్వాత తప్పనిసరిగా జమ అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు , టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో, ఏక మొత్తంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అవుతుందని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జన గణన చేసి, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తుందని అన్నారు . ఇక టిఆర్ఎస్ పార్టి బిఆర్ఎస్ అయిందని, బిఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ లోపించిందని, కెసిఆర్ తన బిడ్డని బిర్లా, అల్లుడ్ని అంబానీ, కొడుకుని టాటా చేశాడని తెలంగాణ సంపదనంతా దోసి కెసిఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందని, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని వంద సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ, పచ్చీసు గ్యారెంటీ పేరుతో ప్రజల ముందుకు వచ్చిందని కచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తుందని, దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు . అదేవిధంగా కేంద్రం సిబిఐ ఈడీ , ఐటి లను ప్రయోగించిందని ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పోలీసుల్ని తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసుకు పంపి అరెస్టుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ లో భయపడేవారు ఎవరు లేరని తెలియజేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం భేటీ బచావో పేరుతో మణిపూర్, ఉన్నావ్, ఆత్రాస్ లలో ఆడబిడ్డల మాన ప్రాణాలు బలి తీసుకున్నారని, దేశంలో మోడీ ప్రభుత్వం 123 లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి దేశాన్ని లూటీ చేసిందని, బీజేపీ పార్టీ అధికారంలోకి రాగనే జన్ ధన్ ఖాతాలో ధన ధన 15 లక్షల రూపాయలు పడతాయని అన్నాడని అలాంటిది ఇప్పుడు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 16,31,039 ఓట్లు కలవని, గతంలో 17 సార్లు ఖమ్మం పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే , 11 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని , కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గారు 3 లక్షల భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు చోటా బాబా, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగండ్ల శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు పోటు అభిలాష్ చౌదరి, రాష్ట్ర ఎరుకల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడ వెంకట్రావు, మహిళా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు బానోతు వినోద, లీగల్ సెల్ నాయకులు, సీనియర్ న్యాయవాది మోజెస్ క్రిస్టోఫర్, గోరంట్ల శాంతారావు , బీసీ సెల్ జిల్లా సీనియర్ నాయకులు కంచర్ల సైదులు, ఎస్టీ సెల్ ఖమ్మం జిల్లా నాయకులు బానోత్ మంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.