Telugu News

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసురావాలనే బలం పెరిగింది : పొంగులేటి 

రాహుల్ జోడో యాత్ర దేశ రాజకీయాల గమనాన్ని మార్చివేసింది

0

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసురావాలనే బలం పెరిగింది : పొంగులేటి

== రాహుల్ జోడో యాత్ర దేశ రాజకీయాల గమనాన్ని మార్చివేసింది

== శేరిలింగంపల్లి జోడో వార్షికోత్సవ కార్యక్రమంలో పొంగులేటి

(హైదరాబాద్-విజయంన్యూస్):

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర దేశ రాజకీయాల గమనాన్ని మార్చివేసిందని, కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకుని రావాలనే బలం పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని శేరిలింగం పల్లిలోని కొండాపూర్ లో రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కీర్తి, పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు యాత్ర ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడిని ఏకం చేయాలనే స్పూర్తితో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసుకుని ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడంలో రాహుల్ గాంధీ నూటికి నూరు శాతం సఫలీకృతులయ్యారన్నారు. యాత్ర తర్వాత పూర్తిగా భారతదేశంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ప్రస్తుతం దేశం యావత్తు కాంగ్రెస్ కావాలని కోరుకుంటుందని ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారం రావడమేనన్నారు. మత విద్వేషాలు సృష్టించే బీజేపీ పార్టీకి అటు కేంద్రంలో, మభ్యపు మాటలతో గారడీ చేస్తున్న బీఆర్ఎస్ కు ఇటు రాష్ట్రంలో కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి: మంత్రి పువ్వాడ పై మువ్వా విజయ్ పైర్