విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్
== బీఆర్ఎస్ ను తరిమికొడతాం: రాహుల్
== కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు
== బీజేపీ, ఎంఐఎం కాపాడే ప్రయత్నం చేసిన ఫలితముండదు
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, బీఆర్ఎస్ పార్టీని తరిమికొడుతున్నామని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాబోతుందని, ఎవరు ఆపలేరని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. హైదరాబాద్ లోని తుక్కగూడెలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపలేరని, ఈ ప్రభుత్వం మారబోతుందని, బీజేపీ, ఎంఐఎం రక్షించుకున్న తెలంగాణ ప్రజలు తరిమికొట్టబోతున్నరని రాహుల్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఇస్తామని మాటిచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని లాభాలు ముఖ్యమంత్రి కుటుంబానికి చెందుతున్నాయని, మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ లాభాల కోసం చేయలేదని, మీ అస్తులు, మీ సొమ్మును బీఆర్ఎస్ దోచుకున్నదని ఆరోపించారు. కాళ్లేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు దోచుకుందన్నారు.
ఇది కూడా చదవండి: ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ
దరణి పేరుతో మీ భూములను లాక్కున్నరాని, దళితల నుంచి భూమిని లాక్కున్నరని ఆరోపించారు. రైతుబంధు పేదల కోసం ఉన్నవాళ్ల కోసం పెట్టిన పథకమని విమర్శించారు. పబ్లిక్ కమీషన్ పేపర్ లీక్ లో కీలకంగా ఉన్నారని, 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. మీ పైసలు, మీ అస్తులు దోపిడి చేసేందుకు బీఆర్ఎస్ దొంగ పథకాలు ప్రవేశపెడుతుందని దుయ్యబట్టారు. అతి కొద్ది రోజుల్లోనే మన ప్రభుత్వం రాబోతుందని, కేసీఆర్ తిన్న మీ పైసలు మీకు ఇవ్వబోతున్నామని రాహుల్ గాంధీ హామినిచ్చారు. కర్నాటక కు వెళ్లి రైతులను, మహిళలను అడగండి.. కాంగ్రెష్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టిందో లేదో అని అన్నారు. అక్కడ ప్రజలందరు చెబుతున్నరు.. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుంది అని అక్కడ ప్రజలు బెబుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పథకాలను ప్రవేశపెట్టదని, అది సీఎం కేసీఆర్ కే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే కచ్చితంగా చేసి తీరుతామని, చేయలేక ప్రజలకు క్షమాపణ చేప్పబోమని అన్నారు. అమలు కానీ పథకాల జోలికి పోయేది లేదని, ప్రజలకు న్యాయం చేసే అమలుకు వీలు ఉన్న పథకాలను మాత్రమే ప్రకటిస్తామని, ప్రకటించిన తరువాత వెనకడుగు వేసేదే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు.. అందరికి ధన్యవాదాలు.. జై హిందు.. జై తెలంగాణ
ఇది కూడా చదవండి: తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: రాహుల్