తెలంగాణకు వర్ష సూచన
== పొద్దుగల రోడ్లను కమ్మేస్తున్న మంచు
== విశాఖలో విమానాలకు అంతరాయం
== మధ్యప్రదేశ్ ను వణికిస్తున్న వర్షం
== 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం పడుతుండగా తెలంగాణలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శనివారం ఉదయం ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో మార్నింగ్ వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం చల్లగా మారడంతో పాటు ఆకాశం మేఘావృతమైంది.
also read ;-అదనపు కలెక్టర్ల బదిలీ
మరో వైపు పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో వాహనదారులకు కూడా కొంత ఇబ్బంది తప్పలేదు. రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో చలిగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇక మధ్యప్రదేశ్ లో మాత్రం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన పడటంతో 19 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇకపోతే తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది..
also read :-ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్….!?
రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో పంటలకు భారీ నష్టమే జరిగింది.. పంట నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు అధికారులు.. ఈ సమయంలో.. మరోసారి వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇకపోతే విశాఖలో దట్టమైన పొగమంచు ఇబ్బందికరంగా మారింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. మరి కొన్ని విమానాలను అధికారులు రద్దు చేశారు. ఉదయం 9 గంటల తర్వాత విమాన రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణికులు గమనించాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాస్ ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు.