తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక..?
== ఓ ఎమ్మెల్యే రాజీనామా.. ఆమోదించిన స్పీకర్
హైదరాబాద్, ఆగస్టు 8(విజయంన్యూస్)
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు.. ఆ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ వెంటనే ఆమోదించారు.. ఇక అంతే.. తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక తథ్యం.. ఆయన రాజీనామాతో తెలంగాణ రాష్ట్రమంతా ఆ నియోజకవర్గం వైపు చూస్తోంది. ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే…?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నియోజకవర్గం మునుగోడు. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామాకాన్ని వ్యతిరేకించిన ఆయన గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాగా ఆ రాజీనామా లేఖను సోమవారం స్పీకర్ కు అందించారు. వెంటనే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమెదించారు. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలపడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. గవర్నర్ అపాయింట్‌మెంట్ ను రాజగోపాల్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ కు ఇప్పటికే గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న విషయం తెలిసిందే.
allso read- గోల్డ్ మెడల్ సాధించిన తెలుగుమ్మాయి