గోపాల్ రెడ్డి కోసం ఏఐసీసీ నుంచి దూతలు
== పార్టీ మారోద్దని సంది ప్రయత్నాలు
== ఏఐసీసీ నుంచి దిగ్గికి బాధ్యతలు
== రేపో మాపో హైదరాబాద్ వచ్చే అవకాశం
హైదరాబాద్, జులై 29(విజయంన్యూస్)
కాంగ్రెస్ లో మునుగోడు ముసలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది.. పార్టీ మారేందుకు రంగం సిద్దమవుతున్న సందర్భంలో ఆ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అంత ఈజీగా వదలుకోవడం లేదు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను దూతలుగా పంపించగా, అయనప్పటికి రాజగోపాల్ రెడ్డి ససమేరా అన్నట్లుగా తెలుస్తోంది.
allso read- రాజగోపాలడు.. రాజీ‘నామమే’నా..?
రేవంత్ రెడ్డి కిందా నేను పనిచేయలేనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీపై రోజుకోక విమ్మర్శలను రాజగోపాల్ రెడ్డి సందిస్తున్నారు. పైగా బీజేపీ వల్లనే సీఎం కేసీఆర్ ఓడిపోవడం జరుగుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని బహిరంగంగానే చెబుతున్నాడు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతే పో.. మహామేదావులు, జననేతలు పార్టీని వీడిన కాంగ్రెస్ పార్టీకి ఏమి కాలేదు. నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత అన్నట్లుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు, నేటిజన్లు ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అంత వ్యతిరేకత ఉన్నప్పటికి ఏఐసీసీ మాత్రం రాజగోపాల్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను అంత ఈజీగా వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. బుజ్జగింపులకు దిగింది. ఇప్పటికే సీనియర్లను రంగంలోకి దింపిన ఏఐసీసీ, ప్రస్తుతం రాజీ మార్గంలో వెళ్తోంది. అందుకు గాను సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ ను దూతగా పంపించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. కోమట్ రెడ్డి బ్రదర్స్ తో దిగ్విజయ్ సింగ్ తో మంచి సత్ససత్సంబందాలు ఉన్నాయి. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం దిగ్గిభయ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన రేపో మాపో హైదరాబాద్ కు వచ్చిన ఆ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా నల్గొండ కు వచ్చి రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని దిగ్గిబాస్ రాష్ట్ర పీసీసీకి చెప్పినట్లు సమాచారం. ఆయన రాజగోపాల్ రెడ్డి కి నచ్చజెప్పడంతో పాటు రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మధ్య సంధి కుదర్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి.. మరీ రాజగోపాల్ రెడ్డి అంశం ఇంతటితో ముగుస్తుందా..? మరింతగా కాక రేపుతుందా..?
allso read- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పుల చేరిగిన తాటి